ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా
కాదని చెప్పవే… కారణం అడగకే మనసా
ఆశని భిక్షగా అడిగా ఇవ్వవే
ఓ, కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ కథల గతులు అడవేనా
పరిచయం అయిన గాలి… నా ఊపిరై చెలిస్తే
తన వశం అయిన ప్రాణం… తనువంతా దహిస్తే
తెగ ఎదురు చూసి తడిసింది కంటిపాపే
సెగ రగులుతున్న ఎద కోరే ఊరడింపే
కథలు కథలుగా… కలలు కలలు మిగిలేనా
చితికి చితికి ఆ కథల బతుకు చితికేనా
అడిగితే నిన్ను నువ్వే… నా దారే ఎటంటూ
బదులుగా నీకు నువ్వే… చెబుతావో రహస్యం
ఏ ధూళిలోన కలిసిందో నీ ప్రపంచం
ఆ అణువు అణువు… వెతకాలి నీ వికాసం
చేరనీ గమ్యమే… చేరువై ఓ క్షణం
చెప్పదా ఈ నిజం, ఓ ఓఓ
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం… నిను నువ్వే