Menu Close

Kadalalle Lyrics In Telugu – Dear Comrade – కడలల్లె వేచె కనులే లిరిక్స్


Kadalalle Lyrics In Telugu – Dear Comrade – కడలల్లె వేచె కనులే లిరిక్స్

కడలల్లె వేచె కనులే… కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే… కదిలేను నదిలా కలలే
ఒడి చేరి ఒకటైపోయే… ఒడి చేరి ఒకటైపోయే
తీరం కోరే ప్రాయం…

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

విరహం పొంగెలే… హృదయం ఊగెలే
అధరం అంచులే… మధురం కోరెలే

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా..!
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా..!
చెంత చేరి సేదతీరే ప్రాయమిలా..!
చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా..!

కాలాలు మారినా… నీ ధ్యాస మారునా
(కాలాలు మారినా… నీ ధ్యాస మారునా)
అడిగింది మోహమే… నీ తోడు ఇలా ఇలా

విరహం పొంగెలే… హృదయం ఊగెలే
అధరం అంచులే… మధురం కోరెలే

కడలల్లె వేచె కనులే… కదిలేను నదిలా కలలే
కడలల్లె వేచె కనులే… కదిలేను నదిలా కలలే

నిన్నే నిన్నే కన్నులలో… దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే నీవుగా
బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో

నీలోన చేరగా (నీలోన చేరగా) … నా నుంచి వేరుగా (నా నుంచి వేరుగా)
కదిలింది ప్రాణమే… నీవైపు ఇలా ఇలా.. ..

Kadalalle Lyrics In Telugu – Dear Comrade – కడలల్లె వేచె కనులే లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading