Menu Close

Jigi Jigi Jigi Ja Lyrics in Telugu – Chettu Kinda Pleader


Jigi Jigi Jigi Ja Lyrics in Telugu – Chettu Kinda Pleader

జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా

జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..

ఓయ్…జిగిజిగిజిగిగిజ
జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా

లాలీ..లాలీ ప్రేమరాణీ..

అనురాగంలోనే సాగిపోనీ
మేనలోన చేరుకోని..సురభోగాలన్నీ అందుకోనీ..
పెదవి పెదవి కలవాలి..
ఎదలో మధువే కొసరాలి..
బ్రతుకే మమతై నిలవాలి..మురళి
స్వరమై పలకాలి..

ప్రేయసి పలుకే మాణిక్య

వీణ.. ప్రేమావేశంలోన..
కౌగిలి విలువే వజ్రాలహారం.. మోహావేశంలోన..
రావే రావే రసమందారమా…!!

జిగిజిగిజిగిజ

జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
నాదేలే మమతల మణిహారం..
నీదేలే వలపుల వైభోగం..

స్నానాలాడే మోహనాంగి..ఇక

సొంతం కావే శొభనాంగి..
దూరాలన్నీ తీరిపోనీ..రస
తీరాలేవో చేరుకోని..
తనువు తనువు కలిసాక..వగలే ఒలికే శశిరేఖ..
ఎగసే కెరటం ఎదలోన..సరసం విరిసే సమయాన..

ముందే నిలిచే ముత్యాల

శాన.. పువ్వై నవ్వే వేళ..
రమ్మని పిలిచే రత్నాల
మేడ..సంధ్యారాగం లోన..
వలపే..పలికే ఒక ఆలాపన..
జిగిజిగిజిగిజ
జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం..
నాదేలే మమతల మణిహారం..
జిగిజిగిజిగిజ జాగేల వనజ రావేల నారోజా
జిగిజిగిజిగిజ ఓ బాలరాజ నీదేర ఈ రోజా

Jigi Jigi Jigi Ja Lyrics in Telugu – Chettu Kinda Pleader

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading