అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Janaki Kalaganaledu Lyrics In Telugu – Raja Kumar
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం… మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
చెలి మనసే శివధనుసైనది… తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు… గెలువనిది ఏది..?
ఒక బాణము ఒక భార్యన్నది… శ్రీరాముని స్థిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే… సిరులన్నీ నావి
తొలి చుక్కవు నీవే… చుక్కానివి నీవే
తుది దాకా నీవే… మరుజన్మకు నీవే
ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
సహవాసం మనకు నివాసం… సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు ప్రణయావేశం… పెదవులపై హాసం
సుమసారం మన సంసారం… మణిహారం మన మమకారం
ప్రతీ రోజు ఒక శ్రీకారం… పరవశ శృంగారం
గతమంటే నీవే… కథకానిది నీవే
కలలన్నీ నావే… కలకాలం నీవే
ఆ ఆఆఆ ఆఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ
రాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు… రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది… ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం…మన జీవన పారాయణం
లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా
లాలల లాలలాల లాలల… లాలలాల లా లా లా