Menu Close

Jala Jala Jalapaatham Lyrics In Telugu – Uppena – జల జల జలపాతం లిరిక్స్

జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను
హే… మన జంట వైపు… జాబిలమ్మ తొంగి చూసెనే
హే… ఇటు చూడకంటు మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే… హా ఆ ఆఆ

జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను

సముద్రమంత ప్రేమ… ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపలా..!!
ఆకాశమంత ప్రణయం… చుక్కలాంటి హృదయం
ఇలాగ బయట పడుతోంది ఈ వేళా, హా
నడి ఎడారిలాంటి ప్రాణం… తడి మేఘానితో ప్రయాణం
ఇక నా నుంచి నిన్ను… నీ నుంచి నన్ను, తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు… రాదు రాదు రోజు
ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం…!!
ఇలాంటి వాన జల్లు… తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం..!!
ఎప్పుడూ లేనిదీ ఏకాంతం… ఎక్కడా లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు… నీలోన నేను, మనకు మనమే సొంతం

జల జల జలపాతం నువ్వు… సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితే నన్ను… పొంగే వరదై పోతాను
ఆఆ, చలి చలి చలిగాలివి నువ్వు… చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వళ్ళితే నన్ను… ఎగసే కెరటాన్నౌతాను.. ..

Jala Jala Jalapaatham Lyrics In Telugu – Uppena – జల జల జలపాతం లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading