ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jagamantha Kutumbam Lyrics in Telugu – జగమంత కుటుంబం నాది లిరిక్స్
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
సంసార సాగరం నాదె… సన్యాసం శూన్యం నావేలే…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
కవినై కవితనై… భార్యనై భర్తనై…
కవినై కవితనై… భార్యనై భర్తనై..
మల్లెల దారిలో… మంచు ఎడారిలో…
మల్లెల దారిలో… మంచు ఎడారిలో…
పన్నీటి జయగీతాల… కన్నీటి జలపాతాల…
నాతో నేను అనుగమిస్తు… నాతో నేనె రమిస్తూ… ఉ ఊ
ఒంటరినై అనవరతం… కంటున్నాను నిరంతరం…
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని…
రంగుల్నీ రంగవల్లుల్ని… కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
మింటికి కంటిని నేనై… కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై… కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై… వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిసినై… నాతో నేను సహగమిస్తూ…
నాతో నేనే రమిస్తూ… ఉ ఊ
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
గాలి పల్లకీలోన తరలి… నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి… తను మూగబోయి నా గుండె మిగిలె…
నా హ్రుదయమే నా లోగిలి… నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి… నా హ్రుదయములో ఇది సినీవాలి…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది.. ..
Jagamantha Kutumbam Lyrics in Telugu – జగమంత కుటుంబం నాది లిరిక్స్