Menu Close

Jagadananda Karaka Song Lyrics in Telugu-Sri Rama Rajyam


జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా… ఆఅ ఆఆ
జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…

జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా… ఆఅ ఆఆ
జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…

మంగలకరమౌ నీ రాక… ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాకా…
నీ పాలన శ్రీకరమౌగాక… సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా…

జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…

సార్వభౌమునిగ పూర్నకుంబములె… స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే… రాగమాల పాడే…
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే…
న్యాయ దేవతే శంకమూదగా… పూలవాన కురిసే…

రాజమకుటమే ఒసగెలె… నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం… పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్షకి పరవసించి పొయే…

జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…
జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…

రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే…
రామ దర్షనము జన్మ ధన్యమని… రాయి కూడ తెలిపే
రామ రాజ్యమె పౌరులందరిని… నీతి బాట నిలిపే…

రామ మంత్రమే తారకం… భహు శక్తి ముక్తి సందాయకం
రామ నామమే అమృతం… శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే…

జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…
జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా…

మంగలకరమౌ నీ రాక… ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాకా…
నీ పాలన శ్రీకరమౌగాక… సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా…

జగదానంద కారకా… జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం… ప్రియ పరిపాలకా

Like and Share
+1
67
+1
49
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading