Menu Close

Jaago Jaagore Lyrics in Telugu – Srimanthudu


Jaago Jaagore Lyrics in Telugu – Srimanthudu

నేల నేల నేల… నవ్వుతోంది నాలా
నట్ట నడిబొడ్డు సురీడులా
వేల వేల వేల… సైన్యమై ఈ వాళ
దూసుకెళ్లమంది నాలో కల
సర్ర సరా సరా… ఆకాశం కోసేసా
రెండు రెక్కలు తొడిగేసా… తొడిగేసా
గిర్ర గిరా గిరా… భూగోళం చుట్టూరా
గుర్రల వేగంతో తిరిగేసా… తిరిగేసా
ఏ కొంచం కల్తీలేని కొత్త చిరుగాలై
ఎగరేసా సంతోషాల జండా… జండా
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ…

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

వెతికా నన్ను నేను
దొరికా నాకు నేను
నాలో నేనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి
పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను
ఎనిమిదిక్కులన్ని పొంగిపోయి ప్రెమై వెలిగి
గుమ్మ గుమ్మా గుమ్మా… గుడెల్ని తాకేలా
గంధాల గాలల్లే వస్తా… హే వస్తా
కొమ్మకొమ్మా రెమ్మా… పచ్చంగ నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా… హే తెస్తా
ఎడారిని కడలిగ చేస్తా… చేస్తా

జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ…

స్వార్ధం లేని చెట్టు బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే
ఏమీ పట్టనంటు బంధం తెంచుకుంటు
మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే
సల్ల సలా సలా… పొంగిందే నా రక్తం
నా చుట్టూ కన్నీరే కంటే.. హే కంటే
విల్ల విలావిలా… అల్లాడిందే ప్రాణం
చేతైన మంచే చేయకుంటే… చేయకుంటే
ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే… ఉంటే
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ… జాగో

Jaago Jaagore Lyrics in Telugu – Srimanthudu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading