Menu Close

ఐ‌పి‌ఎల్ లో వేసే ఒక్కో బాల్ విలువ అక్షరాల 50 లక్షలు..!

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

క్రికెట్ కి మన దేశం లో వున్న ఆదరణ మరెక్కడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజలకు మరింత వినోదాన్ని అందించేందుకు ఐ‌పి‌ఎల్ ని స్టార్ట్ చేశారు. ఐ‌పి‌ఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డ్ కి వస్తున్న సంపద మరే ఇతర బోర్డ్ కి రావడం లేదు.

దీని ద్వారా కేవలం మన క్రికెట్ బోర్డ్ మాత్రమే కాదు, మన దేశానికి ఎంతో కొంత ఆదాయం చేకూరుతుంది. అది కాక మ్యాచ్ లు జరుగుతున్నా చోట్ల, చిన్న చితకా వ్యాపారులు కూడా ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు.

కాగా ఈ మద్య ఐ‌పి‌ఎల్ మ్యాచ్ ల ప్రసార హక్కులను దక్కించుకునేందుకు జరిగిన వేలం పాటలో ఎవరు ఊహించనంత దరతో వివిద కంపెనీలు పోటీ పడ్డాయి.

ఇప్పటి నుండి మరో 5 ఐ‌పి‌ఎల్ సీసన్స్ కి గాను కేవలం “టెలివిజన్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్” ద్వారా 48, 390 కోట్ల సంపద ఐ‌పి‌ఎల్ బోర్డ్ కి రానుంది. ఈ అయిదు సీసన్స్ కి గాను మొత్తం దాదాపుగా 410 మ్యాచ్ లు జరగనున్నాయి.. ఒక్క మ్యాచ్ కి 240 బాల్స్ లెక్కన మొత్తం అన్నీ మ్యాచ్ లకి కలిపి 98, 400 బాల్స్.

ఈ లెక్కన చూసుకుంటే ఒక్కో బాల్ విలువ అక్షరాల 50 లక్షలనమాట. ఇది కేవలం “టెలివిజన్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్”. ఇవి కాకుండా ఇంకా కొన్ని మార్గాల ద్వారా కూడా ఐ‌పి‌ఎల్ కొ మరి కొంత సంపద చేకూరనుంది.

మీ క్రికెట్ ఆడే ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి

IPL Cricket News

Like and Share
+1
1
+1
0
+1
0

Subscribe for latest updates

Loading