Interesting Real Life Stories in Telugu: చనిపోయిన తరువాత ఏమవుతుంది అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. ఇటీవల కాలంలో ఈ ప్రశ్నకు తాము సమాధానం కనిపెట్టామని కొంతమంది చెప్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
అమెరికా దేశం, కాన్సాస్ రాష్ట్రం, విచిటా సిటీలో నివసిస్తున్న చార్లెట్ హోమ్స్( Charlotte Holmes ) (68) అనే మహిళ కూడా తాజాగా మరణం తర్వాత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన కథను చెప్పారు. 2019లో ఆమెకు రక్తపోటు సడన్‌గా పెరగడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, 11 నిమిషాలు ఆమె శరీరం పనిచేయకుండా పోయింది.
అంటే, ఆమె క్లినికల్ డెత్ అనుకున్నారు.ఆ సమయంలో చార్లెట్ హోమ్స్ స్వర్గం చూశానని చెప్పారు. అక్కడ ఆమె దేవదూతలను, తన కుటుంబ సభ్యులను కలిశానని, అంతేకాకుండా నరకం అని పిలువబడే భయంకరమైన ప్రదేశాన్ని కూడా చూశానని చెప్పారు. ఈ అనుభవం ఆమెకు మరణం తర్వాత జీవితం ఉందని గట్టిగా నమ్మేలా చేసిందట.
చార్లెట్‌కు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆమె భర్త డాన్యీ ( Danny )ఎప్పుడూ ఆమె పక్కనే ఉన్నారు. చార్లెట్‌కు స్పృహ లేనప్పుడు కూడా ఆమె పూల గురించి మాట్లాడటం మొదలుపెట్టిందని డాన్యీ చెప్పారు. “ఆ రూమ్‌లో పూలు ఏమీ లేవు” అని డాన్యీ ఓ టాక్‌షోలో చెప్పారు. “అప్పుడే నాకు ఆమె ఈ లోకంలో లేదని తెలిసింది” అని ఆయన అన్నారు.
చార్లెట్ కూడా అదే ఇంటర్వ్యూలో తాను తన భర్తను, నర్సులను చూడగలిగానని చెప్పారు. తాను స్వర్గం వైపు వెళుతున్నట్లుగా అనిపించిందని, చెట్లు, గడ్డి చూశానని, అవి సంగీతానికి అనుగుణంగా కదులుతున్నాయని చెప్పారు. “స్వర్గంలో ప్రతిదీ దేవుడిని స్తుతిస్తుంది” అని ఆమె అన్నారు. మనం ఎప్పుడూ ఊహించలేనిది అక్కడ ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
చార్లెట్ స్వర్గంలో తన తల్లిదండ్రులు, సోదరి వంటి తన ప్రియమైన వ్యక్తులను చూశానని తెలిపారు. వారు ఆరోగ్యంగా, 30ల వయసులో ఉన్నట్లు కనిపించారట. “వారు ముసలివారుగా లేదా అనారోగ్యంతో లేరు. వారు అద్భుతంగా కనిపించారు” అని ఆమె అన్నారు.చార్లెట్ ప్రకాశవంతమైన కాంతిని చూశారు, అది దేవుడు అని ఆమె భావించారు.
ఆ కాంతి పక్కన ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. ఆ పిల్లవాడు తన గర్భంలోనే చనిపోయిన తన కొడుకు అని ఆమె గుర్తించారు. ఇది ఎలా సాధ్యమవుతుందని ఆమె దేవుని అడిగినప్పుడు, “వారు స్వర్గంలో పెరుగుతూనే ఉంటారు” అని దేవుడు సమాధానం చెప్పాడని ఆమె చెప్పారు.
ఆ తర్వాత ఆమె నరకం అంచును చూశానని వర్ణించారు. “నేను కింద చూశాను, వాసన కుళ్లిన మాంసం వంటిది, నేను కేకలు విన్నాను” అని ఆమె గుర్తుచేసుకున్నారు. చార్లెట్ త్వరలో తన శరీరంలోకి తిరిగి లాగబడుతున్నట్లు అనిపించింది, ఆమె ఆసుపత్రి పడకలో మేల్కొంది. ఆమె పూర్తిగా కోలుకొని రెండు వారాల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది.
చార్లెట్ 2023, నవంబర్ 28న 72 సంవత్సరాల వయసులో మరణించే వరకు తన అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. మరణం తర్వాత వేరే జీవితం ఉంటదని చార్లెట్ మాటలను బట్టి అర్థమవుతున్నట్లు చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి కథలు మీరు తరచుగా వింటూనే వుంటారు. దీనికి అసలు కారణం ఏంటంటే, మీరు శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా చూసి వుంటారు.. అందులో క్యారెక్టర్ లానే ఈవిడ కూడా ఇమాజిన్ చేసుకుని వుంటారు .. కేవలం తమకు తెలిసినవే లేదా చూసినవే అక్కడ ఆమెకు కనబడి ఉంటాయి. ఆమెకి అసలు తెలియనివి, ఎప్పుడు చూడనివి కనిపించి వుండవు.
Interesting Real Life Stories in Telugu
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.