ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
వారి నిస్సహాయత – మన అజ్ఞానం – Interesting Facts in Telugu
1. తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక, ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా, యూరప్ వాళ్ళ నిస్సహాయత..!
56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్ లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / – పెట్టి మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’
2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’
వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని తిరగడం ‘మన అజ్ఞానం..!!’
3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం, అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!
ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’
4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’
మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా… కెమికల్ మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం.. ‘మన అజ్ఞానం..!!
5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత…!’
మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’
6. కొబ్బరి నీళ్ళూ, మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత…!’
అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా… పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’
7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం, చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం.. ‘వాళ్ళ నిస్సహాయత…!’
సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం .. ‘మన అజ్ఞానం..!!’
8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!
అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!
9. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత…!
హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!
10. గడ్డకట్టేసిన నీటితో స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ…అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం… వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం ‘వాళ్ళ నిస్సహాయత…!
హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం ‘మన అనంతమైన అజ్ఞానం!!
Telugu Facts You Didn’t Know,
Surprising Telugu Culture Facts,
Interesting Historical Facts in Telugu,
Fun Facts About Telugu Language,
Amazing Facts About Telugu Movies,
Unique Telugu Traditions and Facts,
Telugu Cuisine Interesting Facts,
Fascinating Telugu Literature Facts,
Telugu Festivals Fun Facts,
Mind-blowing Facts About Telangana and Andhra Pradesh
గమనిక : ఈ ఆర్టికల్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com