అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Interesting Facts about Ayodhya: అయోధ్య సమస్య భారతదేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడించిన సమస్యలలో ఒకటి. చివరికి ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించింది. అయోధ్య నగరం ఇతర ప్రాంతాల మాదిరిగా భౌగోళిక ప్రాంతంగా ఉండిపోలేదు. రామ జన్మభూమిగా పురాణాల కాలం నుండి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.
అందుకే మన దేశంలోని అనేక మంది హిందువులు ఈ ప్రాంతాన్ని చేరుకోవాలని, ఈ మట్టిని ఒక్కసారైనా ముట్టుకోవాలని లక్షలాది మంది ఎంతగానో ఆరాధించేలా చేసింది.ఇప్పటివరకు అయోధ్య అంటే రాముని దేవాలయం మరియు బాబ్రీ మసీదు అని చాలా మందికి తెలుసు.

అయోధ్య వివాదం గురించి క్లుప్తంగా ఇక్కడ పొందుపరిచాము

1528: మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాలతో బాబ్రీ మసీదు నిర్మాణం
1853: స్థలం విషయంపై అయోధ్యలో తొలిసారిగా మత ఘర్షణలు
1885: రామ మందిరం నిర్మాణం కోసం తొలి పిటిషన్. మహంత్ రఘువీర్ దాస్ పిటిషన్ను కొట్టివేసిన ఫైజాబాద్ జిల్లా కోర్టు
1949: వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహం ఏర్పాటు ముస్లింల నిరసన
1950: రాముడి విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఫైజాబాద్ సివిల్ కోర్ట్లో రెండు పిటిషన్లు. ఆ స్థలంపై హక్కులు కోరుతూ 1959లో నిర్మోహి అఖారా పిటిషన్ దాఖలు
1984: రాముడి జన్మభూమిగా ప్రకటించి మందిరం నిర్మించాలని నిర్ణయం
1986: మసీదు గేట్లు తెరవాలని, వివాదాస్పద స్థలంలో భక్తులు పూజ చేసుకునేలా కోర్టు తీర్పు
1992: డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత
2003: ఎలాంటి మతపరమైన పూజలు, ప్రార్థనలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు
2010 సెప్టెంబర్ 30: వివాదాస్పద భూమిని వక్స్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు
2011 మే 9: అలహాబాద్ హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే
2017 మార్చి 21 : వక్స్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు కోర్టు బయటే వివాదం పరిష్కరించుకోవాలని జస్టిస్ జేఎస్ ఖేహర్ సలహా
2018 సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల బెంచ్కు కేసును బదిలీ చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
2019: అగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు రోజువారీగా సుప్రీంకోర్టులో వాదనలు.
2019 నవంబర్ 9: వివాదస్పద స్థలం 2.77 ఎకరాలు హిందువులదన్న ధర్మాసనం. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు.

అయోధ్య గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు – Interesting Facts about Ayodhya
రాముని జన్మస్థలమిది: పురాణాల ప్రకారం అయోధ్య నగరం రాముని జన్మస్థలమని అనేక మంది హిందువులు నమ్ముతారు. అందుకే అయోధ్యను పవిత్ర నగరంగా భావిస్తారు. అయోధ్య నగర వైశాల్యం అప్పట్లో 7.056 చదరపు కిలోమీటర్లు.
రాజా హరిశ్చంద్ర జన్మస్థలం: అయోధ్యను రాజా హరిశ్చంద్ర లేదా రాజు హరిచత్ర జన్మస్థలంగా భావిస్తారు. అతను భారతదేశంలో సత్యానికి చిహ్నంగా భావిస్తారు. అతను తన రాజ్యాన్ని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని అమ్మి, తన కలలో ఒక మహర్షికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి బానిస అయ్యాడు.
అయోధ్య మహిమ: అయోధ్య నగరం యొక్క మహిమను తెలుసుకున్న ఇతర దేశాల రాజులు వారి దేశాల్లో కూడా ఈ పేర్లను అనుసరించారట. ఇండోనేషియాలోని యోగ్యకర్త, థాయ్ లాండ్ లోని అయోధ్య వంటి నగరాలను పోలి ఉండటంతో వాటికి అయోధ్య అని పేరు పెట్టారట.
అయోధ్య గురించి అధ్వరణ వేదంలో: అధర్వణ వేదంలోనూ అయోధ్య నగరం గురించి పేర్కొనబడింది. అయోధ్యను దేవనిర్మిత నగరంగా పేర్కొన్నారు. అలాగే అయోధ్య నగరం మానవ జీవ చైతన్యానికి ప్రతీక అని అధర్వణ వేదం చెబుతోంది. అయోధ్య అంటే ధర్మం. అది ధర్మానికి నిలయం అని పురాణాలు చెబుతున్నాయి.
వాణిజ్య నగరం: అప్పట్లో వాణిజ్య పరంగా అయోధ్యతో పోటీ పడే నగరమే లేదు. ఈ నగరంలో సరిగ్గా కేంద్రభాగంలో దుకాణాలు ఉండేవి. ఇక్కడ క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో నగరంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించటానికే సామంతరాజులు ఇక్కడ బారులు తీరేవారు అని పురాణాలు చెబుతున్నాయి.
అయోధ్యకు, దక్షిణ కొరియాకు మధ్య వున్న బందం: దక్షిణ కొరియా మరియు అయోధ్య మధ్య జన్యుపరమైన సంబంధం ఉందట. కొరియా యొక్క అతిపెద్ద రాజవంశం యొక్క యువరాణి హ్యో హ్వాంగ్-ఓకే అయోధ్యలో సముద్ర యాత్రికుడి కుమార్తె. అతను కొరియా కారా రాజవంశం రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందుకని ఇప్పటికీ ఆ వంశీకులు దక్షిణ కొరియా నుండి అయోధ్యకు వస్తూ వుంటారు.

సారు నది ఒడ్డున అందమైన అయోధ్య: అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని సారు నది ఒడ్డున ఉంది. అయోధ్య అంటే ఆధ్యాత్మిక నగరంగా అందరూ భావిస్తుంటారు. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మనవు స్వయంగా నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
వాల్మీకి రచనలలో అయోధ్య విశిష్టత: అయోధ్య నగరంలో అప్పట్లో చదరంగంలో ఉండే పలకల మాదిరిగానే అక్కడి భవన నిర్మాణాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ భవనాలు అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహాలకు కూడా అందని విధంగా ఉండేలా అప్పటి శిల్పులు నిర్మాణ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు వాల్మీకి రచనల్లో కనిపిస్తుంది.
జై శ్రీరామ్ .. దయచేసి ఈ పోస్తుని షేర్ చెయ్యండి.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com