Menu Close

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు గీసిన చిత్రాలివి – Brahmanandam Art Skill

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

హాస్య బ్రహ్మగా బ్రహ్మానందం గారి నటన గురించి అందరికీ తెలుసు కానీ ఆయన చిత్రలేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. లాక్‌డౌన్‌లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు.

మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు ‘ఆంజనేయుని ఆనంద భాష్పాలు‘ పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్‌ చాలామందిని ఆకట్టుకుంది.

ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. వెంకన్న కరుణా రసం కురిపిస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు.

స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్‌ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill
Brahmanandam Art Skill

SUBSCRIBE FOR MORE

Like and Share
+1
2
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading