అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
సంభోగంలో ఎవరికి సుఖమెక్కువ? Who will enjoy more?
ఇలా ధర్మరాజు భీష్ముని అడిగాడు. దానికి భీష్ముడు “దీనిగురించి జరిగిన ఒక కధ ఉంది చెబుతావిన’ మన్నాడు. మీ కోసం (భారతం అనుశా.ప. అశ్వా.1…284 నుండి 307 వరకు స్వేఛ్ఛానువాదం)
భంగాస్వనుడనే మహారాజు కుమారుల గురించి ఒక యజ్ఞం మొదలుపెట్టి నూర్వురు పుత్రులను కన్నాడు. కాని ఆ యజ్ఞం చేయడం ఇంద్రునికి ఇష్టం లేదు. ఒక రోజు భంగాస్వనుడు వేటకి వెళ్ళేడు. అతనికి భ్రాంతి కలిగించి దూరంగా తీసుకుపోయాడు, ఇంద్రుడు.
రాజుకి దాహం కలిగింది, ఒక చెరువు కనపడితే గుర్రం వీఫు తడిసేలోతుకు గుర్రాన్ని దింపి నీరుతాగి ములిగి తేలేటప్పటికి స్త్రీగా మారిపోయాడు. తనని తాను చూచుకుని భంగాస్వనుడు ఆశ్చర్యపోయాడు, కొలనునుంచి బయటపడి, ఈ రూపం తో గుర్రం ఎలా ఎక్కగలను?, పట్నం లోకి వెళితే నన్ను చూసి ఏమనుకుంటారు? నా భార్యలేమనుకుంటారు?, కొడుకులేమనుకుంటారు? పోనీ ఇక్కడే ఉండిపోదామనుకుంటే, అడవిలో ఎలా ఉండటం. అని ఆలోచించి, ఎలానయితేనేం రాజధాని చేరితే, అందరూ అశ్చర్యపోయారు.
స్త్రీ రూపంలో ఉన్నభంగాస్వనుడు మంత్రులను రావించి కొడుకులకు రాజ్యం అప్పగించి అడవికి పోయాడు, తపస్సు చేసుకోడానికి. అడవికి పోయి తపస్సు చేసుకునేవాళ్ళతో కూడి తపస్సు చేసుకుంటుండగా, అందులో ఒకడు ప్రియుడయ్యాడు. ప్రియుని వలన స్త్రీ రూపంలో ఉన్న భంగాస్వనునికి నూర్వురు పుత్రులు కలిగారు. ఈ వందమంది పుత్రులను వెంట పెట్టుకుని రాజధానికి చేరి,
మగతనముననాడు మీరు,న్మగువతనమున వీరు నాయందుదయం
బగుట దోడంబుట్టువు లగుదురు ధర పంచి కుడుపు డందరు ననుడున్…292
“నాకు మగతనం లో మీరు, ఆడతనంలో వీరు కలిగేరు కనక మీరంతా అన్నదమ్ములవుతారు. రాజ్యం మీరిద్దరూ పంచుకుని పాలించుకోండి” అనగా,స్త్రీ రూపంలో ఉన్న భంగాస్వనుని మాట విని కొడుకులందరూ సఖ్యంగా ఉంటారు, రాజ్యం పాలిస్తుంటారు. ఇది చూసిన ఇంద్రుడు, ఇతనికి ఏదో చేద్దామనుకుంటే, మరేదో జరిగి, అపకారం చేయబోతే ఉపకారమై,పుత్ర సంతానం అధికమయి అందరూ ఐకమత్యం గా వున్నారని తలచి, బ్రాహ్మణ రూపంలో అన్నదమ్ముల మధ్య భేదాభి ప్రాయం కలగచేస్తే, వారంతా కొట్టుకు చచ్చారు.
స్త్రీరూపం లో ఉన్నభంగాస్వనుడు గుండెలుబాదుకుంటూ ఏడుస్తుంటే, చూసిన ఇంద్రుడు బ్రాహ్మణ రూపం లో కనపడితే, జరిగినదంతా చెబుతుంది. అంతా విని ఇంద్రుడు తనను ఎరుకపరచుకొని, నాకు ఇష్టం లేని క్రతువు చేసేవు కనక ఇలా చేసేనని చెబుతాడు. అప్పుడు ఆమె సాగిలమొక్కి, తెలియక తప్పు చేసేను మన్నించమని కోరగా, కొందరు పుత్రులను బతికిస్తానంటే, నేను స్త్రీగా కన్న పుత్రులు కావాలని కోరగా, నీవు మగవాడిగా కన్న పుత్రులను ఎందుకు అడగలేదంటే, సిగ్గుపడుతూ ఆ స్త్రీ రూపం లో భంగాస్వనుడు, స్త్రీగా కన్న పిల్ల మీద ప్రేమ ఎక్కువని చెప్పగా! నిజం చెప్పేవు కనక అందరు పుత్రులనూ బతికిస్తున్నాను, నీకు స్త్రీ రూపం పోయి పురుషుడుగా అనుగ్రహిస్తున్నానని వరమిచ్చేడు, ఇంద్రుడు.
దానికి స్త్రీ రూపం లోని భంగాస్వనుడు, పుత్రులను బతికించినందుకు సంతసం, నేను ఇలా స్త్రీగానే ఉండిపోతానన్నాడు. ఆశ్చర్య పోయిన ఇంద్రుడు అలా ఎందుకు స్త్రీగా ఉండిపోవలనుకుంటున్నావని అడుగగా.
సురతంబున కడునెక్కుడు, పురుషులకంటెను సుఖంబు పొలతులకు సురే
శ్వర యట్లగుటను నాకీ వెరవున రమియించి నిలువ వేడుక కలిగెన్…అను,ప..అశ్వా.1.307
సంభోగం లో స్త్రీలకు పురుషులకంటే సుఖం ఎక్కువ అందుచేత నేను ఆ సుఖం అనుభవించాలని, ఇలా ఉండిపోవాలని కోరిక. అని చెప్పేడు. దానికి ఇంద్రుడు అంగీకరించేడు.
ఏంటి ఇదీ ఉందా భారతం లో అంటారా? ఇలలో ఉన్నదే భారతం లో ఉంది, భారతం లో లేనిదేదీ ఇలలో లేదు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com