Inspiring Telugu Stories
పూర్వకాలంలో ఒక రాజుగారు ఒక రహదారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డంగా పెట్టి దూరంగా ఉండి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూస్తూ కూర్చున్నాడు. దారిలో పోతున్న వాళ్ళు అడ్డంగా ఆ బండరాయిని పెట్టినవాళ్ళను, ఆ దేశపు రాజును తిట్టుకుంటూ పక్కనుండి వెళ్లి పోయారు.
చాలా సేపటికి ఒక సామాన్య రైతు అటుపోతూ, అడ్డంగా ఉన్న రాయిని చూసి, తలమీదున్న మూటను పక్కన పెట్టి ఆ బండరాయిని ఒక్కడే శ్రమపడి తొలగించి, తన మూటను నెత్తిన పెట్టుకొని పోబోతుంటే, అక్కడే ఆ బండరాయి ఉన్న చోట ఒక చిన్న సంచి కనిపించింది. విప్పి చూస్తే అందులో బంగారు నాణాలు, ఒక చీటీ కనిపిస్తుంది. అందులో, ‘ఈ బండరాయి తొలగించిన వారికి రాజుగారి బహుమతి‘ అని రాసి ఉంది.
జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి, పరిస్థితులను బాగుచేసుకొనే గొప్ప అవకాశం. అయితే ఈ అవకాశాన్ని సోమరులు నిర్లక్ష్యం చేసుకుంటారు, అడ్డంకులను సృష్టించిన వారిని తిట్టుకుంటారు. వివేకవంతులు తమ ఔదార్యంతో, విశాల హృదయంతో, పట్టుదలతో అడ్డంకులను అధిగమించి తమ పరిస్థితులను మెరుగు పరుచుకుంటారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
సేకరణ – V V S Prasad
ఈ కథ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.