ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Telugu Stories – Comfort zone
రాజు గారికి రాజసం ఉట్టిపడే, రెండు అందమైన డేగలను ఎవరో బహుకరించారు. అరుదైన ఆ డేగలకు శిక్షణ ఇప్పించాడు. శిక్షణ తరవాత అందులో ఒక డేగ హాయిగా, హుందాగా ఆకాశంలో విహరిస్తోంది. రెండో డేగ ఒక చెట్టుకొమ్మ మీద కదలకుండా కూర్చుని ఉంది. రెండో డేగకు ఏమైందో ఎవ్వరికీ అర్థం కాలేదు.
పక్షి వైద్యులకు, జ్యోతిష్యులకు అందరికీ చూపించారు. ఎవ్వరూ దాన్ని ఎగిరేట్లు చేయలేక పోయారు. పల్లెటూరి నుండి వచ్చిన ఒక రైతు దాన్ని ఎగిరేట్లు చేయగలిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు డేగలు రెండూ ఉత్సాహంగా ఎగురుతున్నాయి పైపైకి!
రాజు, రైతును అడిగాడు, ఏం చేసావని?? “ఏంలేదు ప్రభూ! అది కూర్చున్న కొమ్మను నరికేసాను. అంతే!” వినయంగా చెప్పాడు.
మనం కూడా అద్భుతమైన ఎత్తైన లక్ష్యాలు అందుకోగలిగిన వాళ్ళమే. మనలోనూ అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మనం సాధారణంగా మనకు తెలిసిన పనులకే అతుక్కుపోయి వాటిలోనే జీవితాన్ని వెతుక్కుంటాం. నిజానికి అనేకానేక అవకాశాలు ఉన్నాయి. మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాం. పట్టించుకోం. తెలుసుకొనే ప్రయత్నం చెయ్యం. రిస్క్ చెయ్యం . అందుకే మన జీవితాలు నిస్సారంగా, నిరాసక్తంగా, నిస్తేజంగా, నిరుత్సాహంగా సాదాసీదాగా గడిచిపోతున్నాయి. మనం పట్టుకొని వేలాడుతున్న సుఖమైన స్థితి (Comfort zone ) అనే కొమ్మను నరికేసుకొని బయటికి వస్తే ఇప్పుడున్న దానికన్నా గొప్పగా బ్రతకవచ్చు.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories