ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Telugu Stories
గద్ద ఎత్తైన చెట్టు మీదో, కొమ్మ మీదో గూడు కట్టుకుంటుంది. ఆ గూటిలో ముళ్ళు, పదునైన రాళ్ల వంటివాటితో మొదటి వరస నింపుతుంది. ఆ తర్వాత రెండవ వరసగా చిన్న చిన్న కట్టెపుల్లలు, ఈకలు జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర సౌకర్యవంతమైన రక్షణగా ఉంటుంది.
పిల్లలు కొంచెం కొంచెం పెద్ధ అవుతుంటే తల్లి గద్ద, గూడునంతటినీ కలిపేస్తుంది. ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు, రాళ్ళు గుచ్చుకొని బాధ పెడుతుంటాయి. నెమ్మదిగా పిల్లలకు ఆహారం అందించడం కూడా ఆపేస్తుంది. అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం కష్టతరంగా మారిపోతుంది. ఒకవైపు ముళ్ళు పదునైన రాళ్లు గుచ్చుకొంటుంటే, ఇంకొక వైపు భరించలేని ఆకలి బాధ తట్టుకోలేక పిల్లలు బయటికి వచ్చి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఎగిరిపోతాయి.
వున్న చోటే వుంటే ఎప్పటికీ ఎదగవు, ముందడుగు వేస్తేనే జీవితంలో ఎదుగుతావు..
సేకరణ – V V S Prasad
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories