ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inspiring Telugu Stories
ఆ ఊళ్లోకి వచ్చిన ఒక అపరిచితుడిని కొందరు దాదాపు నలభై అడుగుల లోతున్న గుంటలోకి తోసేసారు. ఆ గుంటలో నుంచి బయటికి రావడానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నిస్తే అంత బలహీనపడి పోతున్నాడు. చివరికి, “ఈ గుంట నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కాలేదు. ఈ పోరాటం కన్నా, చచ్చిపోతే బాగుంటుంది.” అనుకున్నాడు.
అప్పుడే, “హెల్ప్.. హెల్ప్.. రక్షించండి.. రక్షించండి” అంటూ కేకలు వినిపించాయి. అవేవో పక్కనే ఉన్న మరొక గుంట నుంచి వినిపిస్తున్నట్లు అనిపించింది. ఆ గుంట దీనికన్నా పది అడుగుల ఎక్కువ లోతు ఉన్నట్టుగా ఉంది. అందులో ఇంకెవరో ఉన్నారు. వాళ్లే అరుస్తున్నట్లున్నారేమో !! జాగ్రత్తగా వింటుంటే గుంట గోడల నుంచి మట్టి కిందికి రాలుతునట్టు, గోడ పగులుతున్నట్లు శబ్దం వస్తోంది. వెంటనే శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని కొద్దికొద్దిగా పైకి పాకుతూ బయట పడ్డాడు. బయటకి వచ్చాక పక్క గుంటలో వున్న వ్యక్తిని కూడా కాపాడాడు.
మీరు పడుతున్న బాధ గురించి తలచుకుంటే, మీకన్నా అధికంగా బాధలు పడుతున్నవాళ్ళు ఎందరో ఉన్నారు. నిరంతరం మీ గురించి మీరు మంచిగా ఊహించుకోండి. ఈరోజు మీ జీవితంలో బాధాకరమైన రోజు కావచ్చు. తెల్లవారితే కొత్త మంచి రోజు వస్తుంది.
మీరు జీవితంలో పడ్డ కష్టాలన్నీ నేడు మీకు గుర్తు వుండవు, కానీ వాటి నుండి మీరు పొందిన ప్రతిఫలం మాత్రం మీకు జీవితాంతం తోడు వుంటుంది. ఎంత పెద్ధ కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోoడి.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories