విలువైన సమాచారం దయచేసి అందరికీ షేర్ చెయ్యండి – Importance of Labels on Fruits in Telugu
మనం గమనిస్తే సూపర్ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరల మీద ఏవో లేబుల్స్ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ లేబుల్.. ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తారు. నిజానికా లేబుల్ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది.
మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి? ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి? అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి.
- ఆపిల్‌కున్న లేబుల్‌పై నాలుగు అంకెలు ఉండి.. మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట.
- లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి.. మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట. జన్యుమార్పిడి అంటే మన బాషలో హైబ్రిడ్ అని.
- లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి.. మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్ పంట. దీని అర్దం ఎటువంటి ఎరువులు వాడకుండా పండించినవి అని అర్దం.
పళ్లపై వున్న లేబుల్‌ని పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేదు. ఆ లేబుల్ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుల్‌ని అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుంది.
దయచేసి అందరికీ షేర్ చెయ్యండి – Importance of Labels on Fruits in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.