ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఓటమిని అంగీకరించినప్పుడే గెలుపు సాధ్యం – Importance Of Failures
చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు.
కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు, బెణకరు.
అడ్డంకులొస్తే అధిగమిస్తారు, సమస్యలొస్తే పరిష్కరిస్తారు.
అంతేగానీ భీరువల్లే పారిపోరు.
మానసిక దౌర్బల్యాన్ని వదలించుకుని జీవితాన్ని
గెలవాలంటే ‘మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్’ – వ్యవహారశైలిని అనుసరించాలి.
అదెలాగంటే…
మార్పును ఆహ్వానించాలి:
మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే
అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది.
ఇది మీకూ కష్టమే! ఎదుటి వారికీ కష్టమే.
కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి.
ఆగిపోకూడదు:
జరిగినదానికి పశ్చాత్తాపపడుతూ,
స్వనిందకు పాల్పడుతూ ఉంటే
జీవితం అక్కడే ఆగిపోతుంది.
కాబట్టి కష్టాలు, నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి
జీవితంలో ముందుకు సాగాలి.
సవాళ్లను అంచనా వేయండి:
రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది.
అలాగని ఎలాంటి ఎత్తుగడలు, ప్రణాళికలు లేకుండా
సవాళ్లను స్వీకరించటం తప్పు.
కాబట్టి సవాళ్ల బరువు తూచి, లాభనష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి.
అపజయాల్ని గెలవాలి:
గెలుపోటములు సహజం.
ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది.
ఓడినచోటే నెగ్గాలి.
కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి.
మీ స్నేహితులకు కూడా “SHARE” చేయగలరు
Life Lessons in Telugu