ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Idi Pattabhi Ramuni Lyrics in Tellugu – Sri Rama Rajyam
ఇది పట్టాభి రాముని ఏనుగురా
జగ జక్కీలు ఎక్కినదిరా
ఇది సీతమ్మవారి ఏనుగురా
మీరు సెప్పింది సేస్తదిరా
ముద్దు ముద్దయిన కునలతో
ఇక పొద్దాక ఆడతడే
ఇహ ఇద్దరినీ ఎత్తుకొని
రాములోరి కోటంత సూపిస్తది
ఇది రాములోరికి జై అనమంటే
తొండం ఎత్తి జై కొడతది
ఇది పట్టాభి రాముని ఏనుగురా
జగ జక్కీలు ఎక్కినదిరా
ఇది సీతమ్మవారి ఏనుగురా
మీరు సెప్పింది సేస్తదిరా
ఆ పట్టాభి రామునికి జేజేలురా
లవ కుసలకు జేజేరా
రాణి సీతమ్మ తల్లికి జేజేలురా
లవ కుసలకు జేజేరా
శంకు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్ష మీకు
రాణి సీతమ్మ పూతోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్ష మీకు
ఆ రామయ్య కథ చెబితే
ఇక ఆలించి ఊఉ కొడతరు
ఆ రాములోరి పాటలకి
ఆదమరిచిక నిద్దరోతరు
ఆ రామ లాలిని ఆపమంటే
అమ్మమ్మ గీ పెడతరు
శంకు చక్రాల పోలిన కూనలారా
ఆ శ్రీ రామ రక్షా మీకు
రాణి సీతమ్మ పూతోట మల్లెలారా
ఆ సీతమ్మ రక్షా మీకు
తర తన్నానా తర నన
తర తన్నానా తర నన
తర తన్నానా తన నన
తర తన్నానా తర నన