ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
I Love You Daddy Lyrics in Telugu – Roll Rida
ఐ లవ్ యు డాడీ
ఐ లవ్ యు డాడీ
ఐ లవ్ యు డాడీ
ఐ లవ్ యు డాడీ
నన్ను నవ్విపించే నాన్న
(నన్ను నవ్విపించే నాన్న)
నన్ను బుజ్జగించే నాన్న
(నన్ను బుజ్జగించే నాన్న)
నన్ను ఆటాడించే నాన్న
(నన్ను ఆటాడించే నాన్న)
నన్ను ఎత్తుకునే నాన్న
(నన్ను ఎత్తుకునే నాన్న)
అమ్మాయి పుట్టాలని
నాకోసం గాజులు ముందే కొన్నావ్ డాడీ
కడుపులో ఉండి నీ మాటల్ మొత్తం
నేను విన్న డాడీ
ఫ్రాకులు కొన్ని బీరువాలో దాచావని
తెలుసు డాడీ
పిలుపుని వింటే నా పేరు
చిట్టి తల్లి కదా డాడీ
పుట్టగానే ముద్దు పెట్టి హత్తుకున్నావ్ డాడీ
నవ్వుకుంటు కళ్ళెంబటి నీళ్లు పెట్టుకున్నావ్ డాడీ
బంగారు కొండా లాంటి హీరో అంటే నువ్వే డాడీ
కొందరిలాగా నన్ను చంపలేదు… థాంక్యూ డాడీ
ఏమైంది బేటా..?
ఎక్కిళ్లొస్తున్నాయి డాడీ.
ఇదిగో వాటర్ తాగు.
మ్ ఇప్పుడు పాడు.
ఓ రోజు స్కూలు నుండి ఫోను వస్తే డాడీ
పరిగెత్తుకుంటూ చెమ్టల్ తోటి వచ్చినాడు డాడీ
నా స్కర్ట్ మీద బ్లడ్ చూసి ఏడుస్తుంటే డాడీ
కడుపుబ్బ నవ్వి కడుపునొప్పి మర్చిపోయే డాడీ
నీలోన ఇన్నోసెంట్ ప్రేమ
చాలా చాలా ఇష్టం డాడీ
కానీ ఇంత సున్నితంగా
ఉంటె చాలా కష్టం డాడీ
వెళ్ళింకా మెచ్యూరిటీ
ఫంక్షన్ రెడీ చెయ్యి డాడీ
నీ చిట్టి తల్లి ఇప్పుడు మహాతల్లి డాడీ
నవ్వుంటె మర్చిపోయి
తీసుకున్నావ్ బరువుని
ఇంతకన్నా గొప్ప వరం
దేవుడికే ఎరుగును
అమ్మాయిలు ఎదగాలని
చదివించావ్ చదువును
గర్వాంగా చెప్పేలాగా
నిల్పెడతా పరువును
నీ అడుగు మీద అడుగు పెట్టి
నడిపించావ్ డాడీ
లోపల పేగులు అరుస్తున్నా
నాకు తినిపించావ్ డాడీ
భుజం మీద ఎత్తుకొని
దారి చూపించావ్ డాడీ
లోపల బాధా ఉన్నా
నవ్వాలని నేర్పించావ్ డాడీ
ఒక్క ఛాన్స్… ఈ డాడీ కి ఒక్క ఛాన్స్ ఇవ్వరా
ఈ పాట తోటి నేరిపిస్తా అర్ధం అయ్యేటట్టుగా
కూతురిచ్చే ప్రేమ విలువ లెక్క కట్టలేమురా
ఆస్తులన్నీ లేకపోయినా లక్ష్మి దేవి లెక్కరా
బుడ్డి నడకలేసుకుంటూ
పెద్ద షర్టు వేసుకొని మునిగిపోయి
తిరుగుతుంటే ముర్సిపోయిననే
మెట్టు మెట్టు తోడు ఉంటు
కాలికేమో మెట్టలేసి
తుడ్చుకోని బాధ్యతంతా తీర్చుకుంటనే
తల్లి విలువ తెలిసింది
నువ్వు వచ్చినప్పుడే
పెదవి పదును తెలిసింది
నువ్వు పిలిచినప్పుడే
స్పర్శంటే తెలిసింది కౌగిలించినప్పుడే
నువ్ ఏడుస్తుంటే నవ్వింది నువ్వు పుట్టినప్పుడే
ఎందుకో సడన్గా నీ రూము సర్దుతుండగా
నీ పిల్లో మీద బ్లడ్డు చూసి గుండె వణిపోయెరా
వెక్కి వెక్కి ఏడ్చుకుంటు హాస్పిటల్లు తిరిగిన
నీకు కాన్సర్ అని తెల్వగానే కుప్పకూలి పోయినా
ఎందుకు డాడీ..! నాకు జ్వరం అని అబద్దం చెప్పావ్.
అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు కదమ్మా.
నువ్ మళ్ళీ పుడ్తావ్ అనే ఆశతోటి నీకు అబద్దం చెప్పాను.
తాతయ్యా..!!!
I Love You Daddy Lyrics in Telugu – Roll Rida