ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
హే తికమక మొదలే… ఎద సొద వినదే
అనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే
హే తెలియక తగిలే… తొలకరి చినుకే
మొహమాటం ఒడిలో… సరదాగా జారి వానై మారే
హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే
చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే
అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో
పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే
ఆ, తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా
అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే
వెతికినది విసిరినది చూపు కౌగిలే
తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే
మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే
ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా
ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో
ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో
ఎద కడలిలో అలలుగా ఎగసేనా
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే
మగువనలా చులకనగా చూడరాదుగా
వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే
కన్నె కళ్ళే నా యద గుట్టే లాగాయే
హే ఎగసిందా లోలోన ఆరాటం
కాసేపైనా దాచే పని లేదా
నా కలలో కూడా నువ్వే వచ్చి
పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే