ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కోవిడ్-19 పెద్దవాళ్ళలో వస్తే కనిపించే లక్షణాల గురించి మనందరికీ ఐడియా ఉంది. కానీ చిన్న పిల్లల్లో కోవిడ్ వస్తే తెలుసుకోవడం ఎలా అనే విషయంపై ఇప్పటికీ ఒక సందేహం నెలకొంది. అయితే ఈ విషయంపై యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువ మందికి లక్షణాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి.
జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం, అలసిపోవడం, మయాల్జియా, రినోరోయా, గొంతు నొప్పి, విరోచనాలు, వాసన కోల్పోవటం, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొంత మంది పిల్లలకు మాత్రం జీర్ణశయాంతర సమస్యలు కూడా ఉంటాయని మినిస్టరీ తెలిపింది. పిల్లల్లో మల్టీ సిస్టమ్స్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనే ఒక కొత్త సిండ్రోమ్ గమనించారు.
ఈ సిండ్రోమ్ లక్షణాలు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, దద్దుర్లు అలాగే కార్డియోవాస్క్యులర్, న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ పిల్లలకి పాజిటివ్ వచ్చి లక్షణాలు కనిపించకపోతే వారి హెల్త్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. లక్షణాలను ముందుగానే గుర్తిస్తే ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ పిల్లల్లో గొంతు నొప్పి, దగ్గు, రినోరోయా వంటి సమస్యలు ఉండి, శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకపోతే వారిని ఇంట్లోనే ఉంచి చూసుకోవచ్చు అని మినిస్టరీ తెలిపింది. ఒకవేళ పిల్లలకి పుట్టుకతోనే గుండెకి సంబంధించిన సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య, క్రోనిక్ ఆర్గన్ డిస్ఫంక్షన్, లేదా ఒబెసిటీ వంటివి ఉన్నా కూడా వారికి ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించొచ్చు అని తెలిపారు.