Menu Close

కాఫీ,టీ తాగే ముందు నీళ్లు తాగకపోతే ఎంత ప్రమాదమో చూడండి-Health Tips in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

అయితే ఇల్లు, ఆఫీస్, హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ, టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతారు.టీ తాగే ముందు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా ?  తెలుసుకుందాం రండి.

రసాయనశాస్త్రంలో ఆమ్లాలు (యాసిడ్స్), క్షారాలు (ఆల్కలైన్) అని ద్రవాలను విడదీసే రెండు విభాగాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా, క్షారమా అని తెలుసుకునేందుకు మాత్రం పీహెచ్ విలువ ఉపయోగపడుతుంది.

పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు.

ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి.

నీరు క్షార స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది.కాఫీ, టీలను తాగితే సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత అవి మన పొట్టలో అల్సర్‌లను, పేగులకు పుండ్లను, క్యాన్సర్‌లను కలిగిస్తాయి. కనుక వీటిని తాగే ముందు నీటిని తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. కాబట్టి కాఫీ, టీలను తాగే ముందు తప్పనిసరిగా నీటిని మాత్రం తాగాల్సిందే.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading