Menu Close

చిక్కుడుకాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత? Health Benefits


చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి.

చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైనది. అంతేకాకుండా విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
చిక్కుళ్లలో వున్న కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్…. వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది.
సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషదంలా పని చేస్తుంది.
నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక
ఆందోళనను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని పొటాషియం కండరాల వృద్దికి, పని తీరుకి తోడ్పడుతుంది. అంటే మనకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నమాట.

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading