ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Rakhi Telugu Wishes, Greetings, Quotes, Status – Top 20 | Rakhi – రాఖీ
రాఖీ కట్టి నన్ను మెప్పించే ఓ బుజ్జాయి
నీ అల్లరే నాకు ఎంతో సంతోషం
నీ నవ్వులే నాకు సంగీతం
ఎప్పటికీ నవ్వుతూనే ఉండాలి నా చెల్లాయి
రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య.
మా చెల్లెమ్మ మనసే మధుమాసం,
చిరునవ్వుల చెల్లెమ్మ ప్రేమే అనురాగం,
ముద్దుల చెల్లెమ్మ ఇంటికి అందం,
మా చెల్లెమ్మ నా కంటికి బంగారం
నా ముద్దుల చెల్లికి రాఖీ శుభాకాంక్షలు.
Rakhi Telugu Wishes
మమతల మాగాణీలో పూసిన పువ్వులం
స్నేహానురాగాలు నింపుకొన్న నవ్వులం
అనురాగానికి ప్రతీకలం
అనుబంధానికి ప్రతిరూపాలయిన సోదరీ సోదరులం.
రక్షా బంధన్ శుభాకాంక్షలు
Happy Rakhi Telugu Wishes
అనుబంధాల హరివిల్లు
ప్రేమాభిమానాల పొదరిల్లు
గిల్లికజ్జాల సరదాలు
తోడు నీడగా సాగిన జీవితాలు
కాలం మారినా,
దూరం పెరిగినా
చెరగని బంధాలు.
అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు..
కలకాలం నిలవాలి ఈ బంధాలు.
ప్రియమైన చెల్లికి రక్షా బంధన్ శుభాకాంక్షలు
Happy Rakhi Telugu Quotes
చెల్లమ్మా..
నీకెంత వయసొచ్చినా
నా కంటికి చిన్న పిల్లవే.
కొండంత ప్రేమను పంచి
నిండుగా దీవించే బంగారు తల్లివి నీవు.
రక్షా బంధన్ శుభాకాంక్షలు
Rakhi Telugu Status for WhatsApp
బుజ్జగింపులు,
ఊరడింపులు,
పోట్లాటలు,
అలకలు
చిన్ననాటి మధుర స్మృతులను
తిరిగిరాని ఆ రోజులను
గుర్తు చేసుకుంటూ
రాఖీ పండుగ శుభాకాంక్షలు
అక్కా..
అమ్మ తర్వాత అమ్మవి నీవు
కంటికి రెప్పలా చూసుకుంటావు
నా అల్లరిని ఎన్నోసార్లు నన్ను బరించావు
కానీ, నా నిశబ్దాన్ని తట్టుకోలేవు
ఎందుకే.. నేనంటే నీకు అంత ఇష్టం మరి.
రాఖీ శుభాకాంక్షలు
Raksha Bandhan Telugu Wishes
తమ్ముడూ..
నువ్వే నా ధైర్యం
నువ్వే నా లోకం
నే తిడితే కోప్పడతావు
నే అలిగితే డీలా పడతావు
నాకు కష్టమొస్తే తోడుంటావు
నా ఆనందానికి కారణమవుతావు
ఎంత కొట్టుకున్నా..
మన బంధం వీడనిది, విడదీయనిది.
సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు
అలసిన వేళ
అమ్మలా జోలపాడి లాలించిన ఓ అన్నా
అలిగిన వేళ అలక తీర్చి నాన్నవయ్యావు
చిరునవ్వును పంచి అనురాగాలకు అర్థం చెప్పావు
నీ చల్లని చూపే నాకు చాలు
రాఖీ శుభాకాంక్షలతో – నీ చెల్లెలు
Happy Raksha Bandhan Telugu Quotes
అమ్మలో సగం..
నాన్నలో సగం..
మా అన్న.
నన్ను నీ కంటిపాపలా చూసుకునే ఓ అన్నా
నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష.
రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య
ఏడిస్తే లాలించావు..
నాకు ఆకలేస్తే కడుపు నింపావు..
చిన్న గాయమైనా అమ్మలా చలించిపోయావు..
నా ఆనందం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నావు..
అన్నయ్యా.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను..
మరు జన్మలోనూ నీ చెల్లినై పుట్టాలని కోరుకుంటూ..
అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు
నిను చూస్తేనే పెరిగాను..
నీ వెనుకే తిరిగాను..
నువ్వు భయం చెబుతుంటే నొచ్చుకున్నాను..
నా మంచికే చెబుతున్నావని.. ఆనందించా.
రాఖీ సాక్షిగా.. అన్నయ్యా నన్ను దీవించు..
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు.
అన్నయ్య నీకు రాఖీ శుభాకాంక్షలు
Happy Raksha Bandhan Telugu Greetings
అన్నయ్యా.. చిరునవ్వుకు చిరునామావి
మంచి మనసుకు మారురూపానివి
మమతలకు ప్రాకారానివి
ఆప్యాయతలకు నిలువెత్తు రూపానివి
రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ చెల్లెలు
Rakhi Telugu Greetings
ప్రియమైన అన్నయ్యా..
తనకన్నా మంచి మనసున్న నిన్ను చూసి
ఆ దేవుడు చిన్నబోయాడు
నీ చెల్లెలుగా మరో అవతారం ఎత్తాలనుకున్నాడు.
మమకారానికి ఆకారమైన అన్నయ్యా..
నీకిదే నా అక్షర పుష్పాంజలి.
ప్రేమతో.. నీ చెల్లెలు.
నీకెంత వయసొచ్చినా
నా కంటికి చిన్న పిల్లవే..
కొండంత ప్రేమను పంచి
నిండుగా దీవించే బంగారు చెల్లివే..
రాఖీ పండుగ శుభాకాంక్షలు.
చెల్లీ..
ఎన్నాళ్లయినా,
ఎన్నేళ్లయినా
ఇరిగిపోని గంధం,
చెరగని గ్రంథం
వసివాడని బంధం,
మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.
రక్షాబంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య..
అనుబంధాల హరివిల్లు
ప్రేమాభిమానాల పొదరిల్లు
గిల్లికజ్జాల సరదాలు
తోడు నీడగా సాగిన జీవితాలు
కాలం మారినా.. దూరం పెరిగినా..
చెరగని బంధాలు..
అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు..
కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు.
ఒక్క తల్లి బిడ్డలం కాకపోయినా
తోబుట్టువు లోటు తెలియకుండా
నాకు అంత కంటే
ఎక్కువ అనురాగాన్ని పంచావు
రక్షాబంధన్ శుభాకాంక్షలు మిత్రమా
Happy Raksha Bandhan Telugu Wishes | Raksha Bandhan Telugu Quotes Top 20 | Happy Rakhi Telugu Quotes | Rakhi Telugu Wishes | Raksha Bandhan Telugu Greetings | Rakhi Telugu Greetings