Menu Close

Gunde Ninda Gudi Gantalu Song Lyrics in Telugu – Subhakankshalu


Gunde Ninda Gudi Gantalu Song Lyrics in Telugu – Subhakankshalu

నిసగమ పమనిస నిసగమ పమనిస
సరిగమ గమపని సరిగమ గమపని
గమగమ పపమప పనిపని నిసనిస ప స

గుండె నిండా గుడిగంటలు, గువ్వల గొంతులు… ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు, సంధ్యా కాంతులు… శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా… ఆ ఆఆ

గుండె నిండా గుడిగంటలు, ఆ ఆ
గువ్వల గొంతులు, ఆ ఆ… ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు, ఆ ఆ
సంధ్యా కాంతులు… ఆ ఆ, శుభాకాంక్షలంటే

చూస్తూనే మనసు వెళ్ళీ నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా
నిలువదు నిమిషం, జుంజుం… నువు ఎదురుంటే,జుంజుం…
కదలదు సమయం, జుంజుం… కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే… నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా… ఆ ఆఆ

గుండె నిండా గుడిగంటలు, ఆ ఆ
గువ్వల గొంతులు, ఆ ఆ… ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు, ఆ ఆ
సంధ్యా కాంతులు… ఆ ఆ, శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించె నాలోనీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే, జుంజుం… కలలకు నెలవై, జుంజుం
కదలని పెదవే, జుంజుం… కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషనీ
ఉన్నట్టుండి నేర్పినావు ఈ రోజునీ
నీ జతలో క్షణమైనా… బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా… ఆ ఆఆ

గుండె నిండా గుడిగంటలు, ఆ ఆ
గువ్వల గొంతులు, ల లా… ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు, ఆ ఆ
సంధ్యా కాంతులు… ఆ ఆ, శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా… ఆ ఆఆ

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading