గ్రాస్ కలెక్షన్ అంటే ఏంటి? నెట్ కలెక్షన్ అంటే ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సినిమా టికెట్ మీద పెట్టిన మొత్తం డబ్బులన్నీ కౌంట్ చేసే విధానాన్ని గ్రాస్ కలెక్షన్ అంటారు. ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మైనస్ చేశాక వచ్చిన డబ్బులను నెట్ కలెక్షన్ అంటారు.అయితే ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. మొత్తంగా టికెట్ అమ్మితే వచ్చిన టోటల్ అమౌంట్ గ్రాస్ కలెక్షన్ కాగా. గ్రాస్ కలెక్షన్ నుండి టాక్స్ లను తీయగా వచ్చేది నెట్ కలెక్షన్. పలు సినిమా విషయంలో గ్రాస్ కలెక్షన్ నే బయటకు చూపిస్తారు నిర్మాతలు.
తమ తదుపరి సినిమాల్లో లాభం పొందేందుకు తాము చేసిన పలనా సినిమా భారీగా గ్రాస్ కలెక్షన్ సాధించింది అని చెప్తారు. అందేకాదు. ప్రసార సాధనాలు కూడా సినిమాల వసూళ్లకు ఎక్కువగా గ్రాస్ కలెక్షన్ మీదే ఫోకస్ చేస్తాయి.
What is the difference between gross collection and net collection?
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.