పట్టుదల ఉన్న వ్యక్తిని ఎవరూ ఓడించలేరు – Grit – Book Recommendations
పుస్తకం పేరు: Grit: The Power of Passion and Perseverance
రచయిత: అంజెలా డక్‌వర్త్ (Angela Duckworth)
ప్రచురణ సంవత్సరం: 2016
సైకాలజీ, సెల్ఫ్-హెల్ప్, పర్సనల్ డెవలప్‌మెంట్ వంటి విషియాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. విజయం కి ముఖ్యమైనది టాలెంట్ కాదు – నిరంతరంగా కృషి.

అంజెలా డక్‌వర్త్ తన పరిశోధనల ద్వారా నిరూపించింది — స్కూల్ స్టూడెంట్స్ నుంచి స్పోర్ట్స్ ప్లేయర్లు, బిజినెస్ లీడర్ల నుంచి మిలటరీ క్యాడెట్ల వరకు… విజయం పొందినవారిలో సాధారణ లక్షణం ఒకటే – అదే “GRIT”. అంటే Passion (ఆసక్తి) + Perseverance (పట్టుదల).
Important points from the the book “Grit: The Power of Passion and Perseverance”
1. విజయం సాధించాలంటే టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదు – పట్టుదల (Grit) వుంటే చాలు.
2. ఇన్‌స్టంట్ సక్సెస్ అనేది ఒక మూడనమ్మకం, నిజమైన విజయం కొన్ని సంవత్సరాల కృషి ఫలితం.
3. ఇవాళ జీరో అయినా, రేపు హీరో కావచ్చు, వదలకుండా ప్రయత్నిస్తే.
4. పట్టుదల ఉన్నవారు ఫెయిలైనా, తిరిగి లేచే ధైర్యం కలిగి ఉంటారు.
5. ప్యాషన్ అంటే మొదట్లో వుండే ఉత్సాహం కాదు, కాలక్రమంగా పెరిగే ఆసక్తి.
6. జీవిత లక్ష్యం చిన్న చిన్న లక్ష్యాలతో గమ్యాన్ని చేరుకోవడమే.
7. పరాజయాలను గౌరవించాలి, ఎందుకంటే అవే సక్సెస్ కు పునాది.
8. “నువ్వు తెలివైనవాడివా, కాదా అన్నది ముఖ్యం కాదు, నువ్వు నిదానంగానైనా ఆపకుండా ముందుకు వెళ్తున్నావా, లేదా అనేదే ముఖ్యం.”
9. ప్రతి రోజు కొంచెం కొంచెంగా మెరుగయ్యే ధోరణి కలవారే విజేతలు.
10. ఒకే విషయంపై ఏళ్ల తరబడి పనిచేయగలగినవాడే పట్టుదల కలవాడు.
11. ప్లాన్ B ఉండకూడదు అని కాదు – కానీ Plan A మీద నమ్మకం ఉండాలి.
12. కుటుంబం, స్కూల్, కమ్యూనిటీ – ఇవన్నీ పట్టుదలని, ఆసక్తిని పెంచే ప్రేరణ కలిగించాలి.
13. పెద్ద లక్ష్యాలు ఉన్నవారు, వాటిని చిన్న మెట్లు గానే తీసుకుంటూ ముందుకెళ్తారు.
14. నేర్చుకునేందుకు కోసం సమయం కేటాయించండి – ప్రతిరోజూ, ఫోకస్ తో.
15. మీకు నచ్చిన పని ఎంచుకోవడం కాకుండా, మీరు చేస్తున్న పనిని ప్రేమించడం నేర్చుకోండి.
16. ఓటమి అనేది అంతం కాదు, ప్రయాణం కొనసాగించే ధైర్యం లేకపోవడమే అంతం అవుతుంది.
17. సాధించాలనే తపన ఉన్నవారు ఎన్ని సార్లు పడిపోయినా, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడతారు.
18. కష్టపడే నైజాన్ని పిల్లలలో చిన్నతనం నుంచే పెంపొందించాలి – టాలెంట్ కంటే “పట్టుదల” మరియు “ఆసక్తి ” అనేవి ముఖ్యమైనవి.
ఈ పుస్తకం “మనం ఎన్నిసార్లు ప్రయత్నించి ఫెయిలైనా, పట్టుదల కోల్పోకుండా ముందుకు వెళ్తే విజయం లభిస్తుందనే నమ్మకం కలిగిస్తుంది.”
మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చెయ్యండి.
తప్పకుండా ప్రతి ఒక్కరూ
చదవాల్సిన పుస్తకం ఇది👇
https://amzn.to/4cIfnqW
ఫోకస్డ్ గా పని చెయ్యడం ఎలా – Deep Work Explained in Telugu – Book Recommendations