అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ
కలల్లోనే ఇంకా ఉన్నాడూ
ఫిల్మ్ స్టారులు క్రికెట్టు వీరులూ
కళ్ళుకుట్టి చూస్తే కుర్రాడూ… డ్రీం బాయ్
రూపులో చంద్రుడూ… చూపులో సూర్యుడూ, డ్రీం బాయ్
ఊరని పేరని జాడనే చెప్పడూ
ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ
ఎంత గొప్పవాడే నా వాడూ
రెప్ప మూసినా ఎటేపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ
ఎంతో..! ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ..! వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
నడకలోని ఠీవి చూసి… సింహమైనా చిన్నపోదా
నవ్వులోని తీరుచూసి… చల్లగాలి కరిగిపోదా
స్టైల్లో వాడంత వాడులేడూ
నన్ను కోరిన మగాల్లు ఎవ్వరూ
నాకు నచ్చలేదే వాట్ టు డూ
నేను కోరిన ఏకైక పురుషుడు
ఇక్కడే ఎక్కడో ఉన్నాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎందుకో..! ఆకలి నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
లోకమంతా ఏకమైనా… లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల… కళ్ళముందు నిలవ లేడూ
చూస్తా ఎన్నాళ్ళూ దాగుతాడూ
కన్నె ఊహలో ఉయ్యాలలూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్న పాటుగా కొర్రుక్కు తిననుగా
ఎందుకంత దూరం ఉంటాడు
ఎంతో..! ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ..! వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ… గ్రీకు వీరుడూ