Menu Close

అదృష్టం దురదృష్టం – తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు – Great Stories


మీ నాన్న గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్ట వంతులే.. కొంత మంది కోట్లు సంపాదిస్తారు. వారిలో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

మైక్రోసాఫ్టు అధినేత సత్య నాదెళ్ళ గారు వేల కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ ఛైర్ కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు. అతను దాదాపు 25 సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు. మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికి తెలుసు.?

అలాగే మాగుంట సుబ్బరామిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు. వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు. అతనికి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు. కానీ అది కూడా ఫలించలేదు.

రేమండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు.. వేల కోట్ల ఆస్తులను తన పుత్ర రత్నానికి బహుమతి గా ఇచ్చాడు. ఇంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది..

మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు. మనము ధర్మ మార్గం లో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును, ఆస్తులను ఒక ధర్మకర్త వలె ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖమును, తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి, సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు.

ఇలా ఎంతో మంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూలకారణం అవుతుంది.

ఇలా ప్రతి వారికీ ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడకూడదు.

ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.

మనకు ఉన్న దానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి.

మనకు మంచి ఆకలి వేస్తూ ఉండటం, ఆకలి వేసినపుడు‌ మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవ ప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా ధనవంతులము.., అదృష్టవంతులము కూడా. దానికి తోడు ప్రశాంతమైన, ధర్మ మార్గం లో జీవనం… ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే..

ఎవరికీ ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడిన వారు కష్టాలు పడతారు. కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలా మంది ధనవంతులకు లేదు గదా..

ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా..? ప్రయత్నించి చూడండి.

ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు.

తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు
వెళ్ళి పోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె గాని
మెండు బంగారంబు మింగబోడు.

ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును, ఆనందమును ఇస్తుంది. సుదీర్ఘ కాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారి తీస్తుంది.

మన కోరికలే అన్ని దుఃఖాలకు మూలకారణం అని బుధ్ధుడు ఎప్పుడో చెప్పాడు. తక్కువ కోరికలతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవ ప్రదంగా జీవించడం చాలా అదృష్టం…!!!

రేపటి తరానికి బతుకు, భద్రత లతో పాటు భారతీయత కూడా నేర్పండి.

మీ
పాత మహేష్

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Stories
Loading poll ...

Subscribe for latest updates

Loading