ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా…
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా
విరిసిన పూమాలగా… వెన్నుని ఎదవాలగా
తలపును లేపాలిగా బాలా…
పరదాలే తీయ్యకా… పరుపే దిగనీయ్యకా…
పవళింపా ఇంతగా మేలా…
కడవల్లో కవ్వాలు… సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు… లేలెమ్మన్నా కదలక
కలికీ ఈ కునుకేల… తెల్లవార వచ్చెనమ్మ…
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా…
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా…
నీ కలలన్నీ కల్లలై… రాతిరిలో కరగవనీ…
నువ్వు నమ్మేలా… ఎదురుగా నిలిచేనే కన్యామణి…
నీ కోసమనీ గగనమే… భువిపైకి దిగివచ్చెననీ…
ఆ రూపాన్నీ చూపుతో… అల్లుకుపో సౌదామినీ
జంకేలా జాగేలా… సంకోచాలా జవ్వనీ…
బింకాలూ బిడియాలూ… ఆ నల్లనయ్య చేత చిక్కి…
పిల్లన గ్రోవై… ప్రియమారా నవరాగాలే పాడనీ…
అంటూ ఈ చిరుగాలి… నిను మేలుకొలుపు సంబరాన…
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా…
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా…
ఆ ఆ ఆ ఆఅ… ఆఆఆ…ఆఆ…ఆఆఅ…ఆఆ…ఆ ఆ ఆఆఆ…
ఏడే అల్లరి వనమాలీ… నను వీడే మనసున దయమానీ…
నందకుమారుడు మురళీలోలుడు… నా గోపాలుడు ఏడే ఏడే…
లీలాకృష్ణా కొలనిలో… కమలములా కన్నెమది…
తనలో తృష్ణ… తేనెలా విందిస్తానంటున్నదీ…
అల్లరి కన్నా…. దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ…
అందరికన్నా ముందుగా… తన వైపే రమ్మన్నదీ…
విన్నావా చిన్నారీ… ఏమందో ప్రతి గోపికా…
చూస్తూనే చేజారే… ఈ మంచి వేళ మించనీక…
త్వరపడవమ్మా సుకుమారి… ఏ మాత్రం ఏమారకా…
వదిలావో వయ్యారీ… బృందావిహారి దొరకడమ్మ…
గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా…
గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా… ||2||