Menu Close

Gopala Baludamma Song Lyrics In Telugu – Ooyala

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Gopala Baludamma Song Lyrics In Telugu – Ooyala

ఓ ఓఓ ఓ ఓ
గోపాల బాలుడమ్మా నా చందమామ…
పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా…
రారా కన్నా… కడుపార కన్నా…
నా చిటికెలు వింటూ చూస్తావే… నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే… నీ అమ్మనురా
నువు ఆడుకొనే… నీ బొమ్మనురా…

గోపాల బాలుడమ్మా… నా చందమామ
పదే పదే చూసుకున్నా… తనివి తీరదమ్మా

గుండె మీద తాకుతుంటే… నీ చిట్టి పాదం
అందె కట్టి ఆడుతుందె… ఈ తల్లి ప్రాణం
అందాలతోని సంగీత పాఠం… నేర్పావ నాకు నీ లాలి కోసం

ఉగ్గు పట్టనా, దిష్టి తగలని చుక్కపెట్టన…
బోసి నవ్వుల బాషతో నువ్వు పిచ్చి తల్లికి
ఊసులు చెబుతూ పలకరిస్తావు… ఊఊ ఊఊ ఊ ఊ

గోపాల బాలుడమ్మా… నా చందమామ
పదే పదే చూసుకున్నా… తనివి తీరదమ్మా

ఏ నోము ఫలమో పండి… ఈ మోడు కొమ్మ
ఈనాడు నిన్నే పొంది… అయిందిర అమ్మా
ఇదే నాకు నేడు… మరో కొత్త జన్మ
ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ…

మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా
నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన
వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మ కిచ్చావు… ఊఊ ఊఊ ఊ ఊ

గోపాల బాలుడమ్మా… నా చందమామ
పదే పదే చూసుకున్నా… తనివి తీరదమ్మా
రారా కన్నా… కడుపార కన్నా
నా చిటికెలు వింటూ చూస్తావే… నేనెవరో తెలుసా నాన్నా
నిను ఆడించే నీ అమ్మనురా… నువు ఆడుకొనే నీ బొమ్మనురా

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading