Menu Close

Gongoora Thota Kada Song Lyrics In Telugu – ‘Venky’

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

హేయ్… గోంగూర తోట కాడ కాపు కాశా
హేయ్… కోడి కూసె వేళదాక ఎదురు చూశా
హేయ్… గోంగూర తోటకాడ కాపుకాశా
హేయ్… కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె ముద్దు ఆశా
నీకు వెన్నముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె… గోరుముద్దలెప్పుడమ్మో !!

ఓరి పిల్లడా తలగడా… మల్లెపూల జల్లెడా
నువ్వు నాకు…. నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ… అంత నచ్చినప్పుడు
దాచమాకు… ఉట్టిమీద పాలమీగడ
హేయ్… గోంగూర తోట కాడ కాపు కాశా
ఆ… కోడి కూసె వేళదాక ఎదురు చూశా

హే… రా రమ్మనీ కన్నుకొట్టగా… కొంగునే చుట్టుకోనా
నా కమ్మని… కన్నె కౌగిలింత కానుకివ్వనా
ఛీ పొమ్మని నన్ను… ఊరికే నెట్టినా వదులుతానా
నీ తియ్యని… చెంపగిల్లకుండ ఉండగలనా
ఏయ్ గువ్వా గోరింకలాటకే… పోదాము రావా
గుమ్మ గుమ్మళ్ల గూటకే ఏయ్
చుమ్మా చుమ్మాల ముద్దుకే… సందేళ రావే గున్నా మావిళ్ల తోటకే

ఓరి పిల్లడా మల్లుడా… ఇంటికొస్తే అల్లుడా
కంది సేను పక్క… నిన్ను కలుసుకోనా
ఓసి అమ్మడూ గుమ్మడూ… పొద్దువాలినప్పుడు
పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా… హేయ్ హేయ్ హేయ్
గోంగూర తోట కాడ కాపు కాశా…
కొక్కొరోక్కో కోడి కూసే… వేళదాక ఎదురు చూశా

ఓఓ… నీ చెక్కిలి బుగ్గ చుక్కనై… చక్కగా నొక్కుకోనా
ఆ… పక్కగా నిన్ను… కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా
హే… నా కొప్పులో నిన్ను… ముద్దబంతి పువ్వులా పెట్టుకోనా
మా గొప్పగా నీకు… ఏకదాటి ముద్దులెట్టనా
హేయ్ కయ్యా కయ్యాల పిల్లవే… కమ్మేసుకుంటె
తియ్యా తియ్యని బిళ్ళవే హయ్…
ఏయ్ మువ్వా గోపాలకృష్ణుడే… నా గుమ్మ సోకు
ఉంగా ఉంగాలకొచ్చనే హై హై…

ఓసి అమ్మడూ గుమ్మడూ… గుప్పెడంటే గుప్పెడు
నడుము ఒంపు చూసుకోనే… రోజు ఎప్పుడూ
ఓ ఓయ్… పిల్లగా చల్లగా… అల్లమల్లె గిల్లగా
పైట చెంగు జారి పోయే… నాకు ఇప్పుడూ

హేయ్ గోంగూర తోట కాడ కాపు కాశా
హ హ హ హ… కోడి కూసె వేళదాక ఎదురు చూశా
అంతలోనే పెరిగిపోయె… ముద్దు ఆశా
నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా
కోరుకున్న దోరకన్నె… గోరుముద్దలెప్పుడమ్మో
ఆఆ ఆ… పిల్లడా తలగడా… మల్లెపూల జల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడా
ఓసి అమ్మడు గుమ్మడూ… అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading