ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు ఝల్లుమన్నవే
అబ్బబ్బో మావ అదిరింది బావ
ఈ చందమామ అడిగేసే మావో
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ
నీ కాలి మువ్వల్లో సైగలున్నవే… నీ కాలి మువ్వల్లో సైగలున్నవే
సాటుగ వచ్చి సరసం ఆడమన్నవే
నేనొల్ల నేనొల్ల నేనొల్లరో… ఆకతాయి సిన్నోడ నేనొల్లరో
మాటకారి సిన్నోడ
మా ఊరోళ్ళతో నాకు మాటొస్తది
మాటొస్తది మావ మాటొస్తది, హా
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్లా ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ
నీ పాలబుగ్గ సిరిమల్లె మొగ్గ
నా చేత గిల్లాలని ఉబలాటమే
నీ లేత నడుము సంపంగి వనము
ఓసారి తాకాలని ఆరాటమే
ఏం పిల్ల మాటాడవు… ఓ ఎర్ర ఓణి ఎంకటమ్మ, ఏం పిల్ల మాటాడవు
ఏం పిల్ల ఎదురియ్యవు… ఈ సింధులేసే సిన్నోడికి, ఏం పిల్ల ఎదురియ్యవు
నా పాలబుగ్గ గోరింక గిల్లే… నా లేత నడుము నెలవంక అడిగే
ఇంకేదో ఇమ్మంటే ఇచ్చేస్తాలే
అరె..! నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ
హ..! నేనొల్ల నేనొల్ల నేనొల్లరో… ఆకతాయి సిన్నోడ
సై అంటే సై సై
నై అంటే నై నై
హొయ్ అంటే హొయ్ హొయ్, సయ్య సయ్యా
నీ తీపి ముద్దు సరిహద్దులొద్దు… పోతుందే పొద్దు ఊరించొద్ధే
నీ కౌగిలింత ఓ పాలపుంత… కసరొద్ధే కాంత చేరే చెంత
బాలమణి బాలామణీ బాలమణి బాలమణి
కబురేదో సెప్పరాదే బాలమణి
బాలమణి బాలామణీ బాలమణి బాలమణి
మనసేదో ఇప్పారాదే బాలమణి
నా తీపి ముద్దు రాచిలకకిద్దు
నా కౌగిలింత మరుమల్లెకిద్దు
మిగిలింది నీదేలే… ఎళ్ళు ఎళ్ళోయ్
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ
నీ కాలి మువ్వల్లో సైగలున్నవే… నీ కాలి మువ్వల్లో సైగలున్నవే
సాటుగ వచ్చి సరసం ఆడమన్నవే
నేనొల్ల నేనొల్ల నేనొల్లరో… ఆకతాయి సిన్నోడ నేనొల్లరో
మాటకారి సిన్నోడ
మా ఊరోళ్ళతో నాకు మాటొస్తది
మాటొస్తది మావ మాటొస్తది, హాయ్
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్లా ఘల్లుమన్నవే
పిట్ట నడుము సత్తెమ్మ