భర్త (భార్యతో): నా అభిమాన హీరో సినిమాలన్నీ నేను మూడేసి సార్లు చూస్తుంటాను తెలుసా?
భార్య : ఆశ్చర్యమేముంది, మీకు ఏది ఒకసారి చెపితే అర్థం కాదుగా !
చింటూ(బంటి తో): చీమలను చూసి మనం ఏం నేర్చుకోవాలి రా?
బంటి : తీపి తినడం.
కనకారావు: తాయరమ్మతో, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మాఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు……….
తాయారమ్మ: ఎందుకు, ఎవరు ఒప్పుకోవడం లేదు?
కనకారావు : మా ఆవిడా, పిల్లలు
తాయారమ్మ(బంగారయ్యతో): భర్త సుఖముగా ఉండాలంటే భార్య ఏ నోము చేస్తే మంచిది?
బంగారయ్య : మూగనోము!
ఆఆఆఆఆ…..
చిన్నమ్మి: పెళ్ళైన మూడు రోజులకే మీవారు ఎలా పోయారు చిన్నమ్మి?
పెద్దమ్మి : మొదటి రోజు కాళ్ళు నొప్పంటే పట్టాను, రెండో రోజు నడుమునొప్పి అంటే పట్టాను, మూడో రోజు గొంతు నొప్పి అంటే పట్టాను, అంతే ……….?
ఆఆఆఆఆ…..
అప్పారావు : మా తాత చాలా తెలివిగలవాడని, పైగా చాలా ముఖాలు ఉండేవని మానాన్న చెబుతుంటారు.
సుబ్బారావు : అలాగా! నువ్వు చూశావా?
అప్పారావు : లేదు. “మీ తాత బహుముఖ ప్రజ్ఞాశాలిరా! అని మా నాన్న చెబుతుంటారు.
ఆఆఆఆఆఆఅ
అప్పారావు(సుబ్బారావుతో): నువ్వు వాచ్ మన్ గా పనిచేస్తున్నావు కదా, దొంగలు పడితే ఎందుకు పట్టుకోలేదు.
సుబ్బారావు : నేను వాచ్ మన్ ని కాని కాచ్ మన్ ని కాదు.
ఆఆఆఆఆ……….
బంటి : “నాన్నా! నేను ఎక్కువ తింటూ ఉంటానని అరుస్తూ ఉంటావుగా. మరి నాకు పోటిలో మొదటి బహుమతి వచ్చింది తెలుసా?
నాన్నా : మంచిది! ఇంతకీ ఏ పోటీలో?
బంటి : తిండి పోటీలో
ఆఆఆఆ…………
బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.
ఆఆఆఆఆఆఆ…………………………..!
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.