Menu Close

Funny Telugu Jokes-తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Funny Telugu Jokes

jokes laughing kid

బంటి(వాళ్ళ నాన్నతో): నాన్నా, ఒక్కగ్లాస్ మంచినీళ్ళు తెచ్చివ్వు.
నాన్నా: నువ్వే వెళ్లి తెచ్చుకో, ఈసారి అడుగితే తంతాను.
బంటి: సరే తన్నేటప్పుడైన తీసుకొని రా.
ఆఆఆఆఆఆఅ…………..!

(ఇద్దరు వ్యక్తులు    మందు తాగి ఈ విధంగా మాటలాడుకుంటున్నారు)
 అప్పారావు: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?
సుబ్బారావు : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం,
విషం తాగితే  మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ  చిందులేస్తారు.

సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.
ఆఆఆఆఆఆ……………..

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!
ఆఆఆఆఆఆఆఆఅ…!

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి “
ఏమండీ మీ బందువొస్తోంది…పలకరించండి”
అంది నవ్వుతూ.
వరహాల రావు: “నమస్తే అత్త గారు…………..బాగున్నారా?”
నేను మీ అమ్మాయి “Evening Walk” కి బయలుదేరామండి”
అని పలకరించాడు వరహాల రావు.
ఆఆఆఆఅ….

చింటూ: “ఈ పెయింటింగ్ 200 ఏళ్ళ 10 రోజుల కిందటిది కదా?”
బంటి: “అంత సరిగ్గా ఎలా చెప్పగలవు?”
చింటూ: “10 రోజుల క్రితం దీన్నికొన్నప్పుడు షాపువాడు 200 ఏళ్లది అని నాకు చెప్పాడు.”
ఆఆఆఆఆఆఆఆ..

చిన్ని: మీ అక్క వయసు యెంత?
కుట్టి: 25 ఏళ్ళు.
చిన్ని: కాని ఆమె నాతో 20 అని చెప్పిందే!
కుట్టి: ఆమె 5 ఏళ్ళకు లెక్కలు నేర్చుకున్నది.

(ఫోన్ రింగయ్యింది)
సుబ్బారావు: హలో!బాబు మీ నాన్నకి ఫోన్ ఇవ్వు?
చింటు: మా నాన్న ఇంట్లో లేరండి.
సుబ్బారావు:సరే అమ్మకు ఇవ్వు.
చింటు: అమ్మ కూడా లేదండి.
సుబ్బారావు: ఇంకెవరూ లేరా?
చింటు: మా సిస్టర్ ఉంది.
సుబ్బారావు: అయితే ఆమెకివ్వు.
చింటు: ఉయ్యాలలోనుంచి తీస్తే ఏడుస్తుంది మరి………..ఇమ్మంటారా?

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading