Menu Close

సరదాగా కాసేపు నవ్వుకోండి – Funny Stories in Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Funny Stories in Telugu – పెల్లి చూపులు

“అమ్మాయిని తీసుకులమ్మంటాలా? మళ్ళీ వర్జ్యం వచ్చేత్తుంది?” అనడిగారు పిల్ల తండ్రి.”తీసుకులండి” అన్నాడు పిల్లాడి తండ్రి.’వీల్లూ మన తైపే’ అనుకున్నాడు పిల్ల తండ్రి. ఇంతలో అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టారు ముత్తైదువలు. “పేలేంతి?” అనడిగాడు అబ్బాయి. తలెత్తి చూసింది అమ్మాయి. చక్కగా ఉన్నాడు అనుకుంది.

indian art love women

ఇద్దరి కల్లూ కలిసాయి. “పేలా?” అనడిగింది ఆ అమ్మాయి కొంచెం కొంటెగా.”అదే మీ పేలు అంటే యువల్ నేమ్ అని” అన్నాడు అబ్బాయి.”కాలింది” అని చెప్పింది అమ్మాయి.”కాలిందా? ఎక్కలా?” అనడిగాడు అబ్బాయి కంగారుగా .. “కాలింది అంతే నా పేలు అంతే మై నేమ్” అన్నది ఆ అమ్మాయి బుంగ మూతి పెట్టి. “ఓహో .. మీ పేలే కాలిందా? ఇంకా మీకెక్కలైనా కాలిందేమో అనుకున్నాను” అన్నాడు అబ్బాయి.

“అమ్మాయి మాకు నచ్చింది. ముహూత్తాలు పెత్తేసుకుందాం” అన్నాడు పిల్ల తండ్రి. “అలాగేనంది. ఎప్పులు పెత్తుకుందాం?” అనడిగాడు పిల్ల తండ్రి.

“మీలెప్పులంతే అప్పులే .. ” అన్నాడు పిల్లాడి తండ్రి.”అప్పులా ..? పెల్లికి ముందే అప్పులేంతంది?” అనడిగాడు పిల్ల తండ్రి.”అప్పులంతే ఆ అప్పులు కాదు, వెనెవల్ యూ వాంత్ అని” అంటూ ఆంగ్లమందు వివరించాడు పిల్లాడి తండ్రి.

“సలేనంది. మాఘ మాసంలో పెత్తుకుందాం” అన్నాడు పిల్ల తండ్రి. “మాఘ మాసం అంటే మలీ దూలం అవుతుందేమో?” అన్నాడు పిల్లాడి తండ్రి.”దూలమా?” అనుమానంగా అడిగాడు పిల్ల తండ్రి. “దూలం అంటే ఆ దూలం కాదంది. మలీ డిస్టాంట్ అవుతుందేమోనని” అని మళ్ళీ వివరించాడు పిల్లాడి తండ్రి.

“ఓహో .. అదా సంగతి? సలే .. తొరలోనే పెత్తుకుందాం. మరి లాంచనాల సంగతి కూలా మాత్తాలేసుకుందామా ఇప్పులే?” అన్నాడు పిల్ల తండ్రి. “అత్తాగే .. ముందుగా పెల్లికి బత్తలు మీలు తీసుకుంతాలా? మమ్మల్ని తీసుకోమంతాలా?” అని అడిగిండి పిల్లాడి తల్లి.’ఓహో .. వియ్యపురాలు కూడా మా ఆఁవిడ తైపే’ అనుకున్నాడు పిల్ల తండ్రి.” మీలే తీసుకోంది. ఆ దబ్బులు మేమిస్తాం” అన్నది పిల్ల తల్లి. “పిల్లాదికి ఐదు జతల బత్తలు పెత్తాలి” అన్నది పిల్లాడి తల్లి.

“ఐదు జతలా? ఎప్పులెప్పులు పెత్తాలి?” “మొత్తమొదత నాతకం అప్పులు పెత్తాలి””నాతకఁవా?””అదేనంది .. కాశీ యాత్ల .. గద్దం కింద బెల్లం పెత్తాలే .. అది””ఓహో .. ఆ నాతకఁవా?”ఇంకో జత వల పూజప్పులు.. “”వల పూజా? వలకు పూజ చెయ్యాలా?” “వలపూజంతే వలకు పూజ కాదంది. అబ్బాయికి పూజ చేత్తాలే .. అప్పులు .. “

indian art love women

“ఓ .. ఆ వల పూజా?” “పెల్లి పీతల మీద .. “”పీతలా ..?” “అదేనంది. కూచుంతాలు కదా పెల్లికి .. అవి” “ఓహో ఆ పీతలా?” “ఔనంది. ఆ పీతలే .. అప్పులొక జత .. నాగవల్లి, సదస్యం అప్పులు ఇంకో జత, అప్పగంతులప్పులు ఇంకో జత .. “”గంతులా .. ?””ఓ .. సాలీ .. అప్పగింతలప్పులన్నమాత” “సరే .. మీలు అమ్మాయికెప్పులెప్పులు పెలతాలు?”

“పెద్ద పత్తు చీల ఒకతి, వల పూజప్పులొకతి, నాగవల్లి అప్పులొకతి పెత్తాం” “మలి తాలి బొత్తు?” అడిగింది పిల్ల తల్లి.”ఎవరి బొత్తు వాల్లే తెచ్చుకోవాలి. మీలు తెచ్చేది మేం తెచ్చేదానికన్నా అల గ్లాము తక్కువుందాలి” “అత్తాగే .. “”మాది లౌండుగా ఉంటుంది. మీలు కూదా అలాంటిదే చేయించంది” అన్నది పిల్లాడి తల్లి.”

తాలి ఎక్కలైనా లౌండుగానే ఉంతుందిలెంది””మలే .. ఈ మజ్జ పాసన్లంటూ స్టాలు తైపులో వస్తున్నాయంత””స్తాలు తైపా?””అదేనంది .. నచ్చత్తంలాగా ..””యెబ్బే .. అలాంతి అనాచాలాలు మా ఇంతా వంతా లేవంది. మేం లౌందుగానే చేయిత్తాం””మలి కాల్లు కడిగే పల్లెం వెండిదే పెట్టాలి””వెందిదా?””మల్లీ మీకే వత్తుందిగా?” “ఐతే సలే .. మలి మా అమ్మాయికి బంగాలం ఎంత పెత్తాలు?”

“మీ అమ్మాయి బలువులో ఒక శాతం పెత్తాం””మా అమ్మాయి బలువు తొంభై కిలోలు” “చూత్తే సన్నగా ఉందే?””ఈ మజ్జే పెలిగింది” “ఓహో .. పెల్లయ్యాక బలువు తగ్గితే బంగాలం వాపచిచ్చేత్తాలా?”ఇలా రాసుకుంటూ పోతే జీవిత కాలం చాలదు. అంచేత ఇంతటితో సమాప్తి. సరదాగా రాసిందే బాబూ ❤

!!!! నత్తి ఇంత ప్రమాదకరమా!¡¡ అని అనుకున్నారా ఇలాగే రాస్తే అందరి ఆరోగ్యాలూ దారి కొస్తాయి.. అని నా ఉద్దేశ్యం..మరి మీరేమంటారు..😅

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Funny Stories in Telugu
Comedy Stories in Telugu
నవ్వులు తెప్పించే కథలు

నెంబర్ 1 కవితల వెబ్ సైట్ – https://kavithalu.in

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading