ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Funny Quotes in Telugu – Telugu Jokes – తెలుగు జోక్స్
ఒకే తప్పును రెండు సార్లు చేయద్దు.
మనం చేయడానికి కొత్త తప్పులు బోలెడన్ని ఉన్నాయి.
రోజుకోదాన్ని చేసేద్దాం.
నా గురించి నేను తెలుసుకోవడానికి ఓ మాన్యువల్ ఉంటే బాగుండు.
ఈ మధ్య బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా.
వీకెండ్ తర్వాత వచ్చే
ఆ ఐదు రోజులు గడపడం చాలా కష్టమబ్బా.
నువ్వు కన్విన్స్ చేయలేకపోతే..
కన్ఫ్యూజ్ చేసెయ్.
విజయానికి నాకు కీ దొరికిందని సంబరపడే లోపు..
ఎవరో తాళం మార్చేస్తున్నారు.
నిశ్శబ్ధంగా ఉంటే మూర్ఖుడు కూడా
తెలివైన వాడిలాగే కనిపిస్తాడు.
ఇల్లు చాలా నీట్ గా ఉందంటే..
ఇంట్లో ఏదో పగిలిందని గుర్తించాలి.
నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే…
పర్వతమంత ఉన్న నీ అహంపైకి ఎక్కుతా.
అక్కడి నుంచి నీ ఐక్యూలోకి దూకేస్తా.
నీకు కావాలంటే నా సలహా తీసుకో.
నేను దాన్ని పెద్దగా వాడట్లేదు.
నా వ్యాలెట్ ఉల్లిపాయలాంటిది.
దాన్ని తెరిచిన ప్రతిసారి నా కళ్లల్లోంచి నీళ్లొస్తాయి.
జీవితాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోవద్దు.
మనం బతికుండగా దాన్నుంచి బయటపడటం చాలా కష్టం.
‘ఫ్రీ షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్’
ఆన్లైన్ షాపింగ్లో ఇది చూసినప్పుడు కలిగే ఆనందానికి మించింది ఏదీ లేదు.
సెలవులో ఉన్నప్పుడు నేను చేసే ఉద్యోగం మీద
ప్రేమ తెగ పెరిగిపోతుంది.
డ్యాన్స్ చేయడం నేర్చుకోవడం చాలా ఈజీ..
శీతాకాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తే చాలు.
వాకా వాకా పాటికి షకీరా కంటే బాగా డ్యాన్స్ చేస్తాం.
హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్ ఎప్పుడూ
సీక్రెట్ గానే ఉంటుంది.
ఎప్పుడూ సంతోషంగా ఉండే జంటను చూసి
లవ్ బర్డ్స్ అని పిలుస్తాం.
ఎప్పుడూ కొట్టుకునే వారిని యాంగ్రీబర్డ్స్ అనాలా?
ఫొటోషాప్ 30 డేస్ ఫ్రీ ట్రయల్ పూర్తయ్యేదాకా
ఈ ప్రపంచంలో మనకంటే అందమైన వాళ్లు ఇంకెవరూ ఉండరు.
మన విషయంలో మనం ఎప్పుడూ నిజాయతీగానే ఉండాలి.
అబద్ధాలు పక్కవాళ్లకి చెప్పాలి.
ఈ ప్రపంచంలోని పుస్తకాలన్నింటి కంటే..
ఒకే ఒక్క వైన్ బాటిల్లో వేదాంతం ఎక్కువ ఉంటుంది.
Funny Quotes in Telugu – Telugu Jokes – తెలుగు జోక్స్