Menu Close

జపాన్‌ ప్రజలు అంత సన్నగా ఉండటానికి కారణాలు ఇవే, మీరు కూడా ఫాలో అవ్వండి – Food Habits to Stay Slim


జపాన్‌ ప్రజలు అంత సన్నగా ఉండటానికి కారణాలు ఇవే, మీరు కూడా ఫాలో అవ్వండి – Food Habits to Stay Slim

మన దేశంలో ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. పది మందిలో ఐదుగురు అధికబరువుతో ఉన్నారు. కానీ మీరు జపాన్‌, కొరియా లాంటి దేశాలు చూసుకుంటే.. వాళ్లు చాలా స్లిమ్‌గా ఉంటారు.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
Weight Loss Diet in Telugu by Telugu Bucket

మనం ఒకసారి బరువు పెరిగిన తర్వాత అది ఎలా నియంత్రించాలా అని అప్పుడు తంటాలు పడుతుంటాం. ఏం చేసినా బరువు తగ్గడం అంత తేలిక కాదు.

జపనీయులు ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంటారు. జపనీస్ ప్రజలను చూసి వారి వయస్సు చెప్పడం కష్టం. ఆరోగ్యకరమైన జపనీస్ ప్రజలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. జపనీస్ ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.

జపనీయులు స్లిమ్‌గా ఉండటానికి కఠినమైన నియమాన్ని అనుసరిస్తారు: జపనీయుల ఫిట్‌నెస్ రహస్యం వారి స్థిరమైన ఆహారంపై ఆధారపడి ఉంటుంది. వీరి డైట్ పాటిస్తే ఊబకాయం సమస్య తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు సుదీర్ఘ జీవితాన్ని గడపడానికి కూడా సహాయపడుతుంది.

జపనీయులు కడుపు నిండా తినరు: జపనీయులు భోజనం చేసేటప్పుడు పొట్టకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కడుపు నిండా తిండి తినరు. 80 శాతం మాత్రమే పొట్టను నింపుతారు. ఖాళీ విశ్రాంతితో జీర్ణక్రియ సులభం అవుతుంది. కొవ్వును సృష్టించడానికి బదులుగా, తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది మరియు శక్తి ఉత్పత్తి అవుతుంది.

Food Habits to Stay Slim Japanese

ఫుడ్ ప్లేట్ చిన్నగా ఉంచండి : ఫుడ్ ప్లేట్ చిన్నదిగా ఉండాలి. ప్లేట్ పెద్దగా ఉంటే, ఆహారం పెద్ద పరిమాణంలో వడ్డిస్తారు. దీని కారణంగా, పరిమితికి మించి ఆహారం కడుపులోకి ప్రవేశిస్తుంది. అదే ప్లేటు చిన్నగా ఉంటే ప్లేట్‌లో తక్కువ ఆహారం పెడతారు. మళ్లీ రెండోసారి ఆహారం అందించేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం. మీ ఆకలిని నియంత్రించడానికి ప్రయత్నించండి. జపనీయులు కూడా చిన్న ప్లేట్‌లో తినడానికి ఇష్టపడతారు.

ఆహారంపై దృష్టి : టీవీ, మొబైల్ చూస్తూ భోజనం చేస్తుంటే ఎంత ఆహారం తీసుకుంటున్నారనే విషయం తెలియక మానదు. టీవీ రూంలో ఉన్నవాళ్లకు కడుపు నిండుతుందో లేదో తెలియదు. జపనీస్ నియమాల ప్రకారం, మీరు తినేటప్పుడు మీ దృష్టి మొత్తం ఆహారంపై ఉండాలి. అప్పుడు మీరు పరిమితికి మించి తినలేరు.

నోటిపై శ్రద్ధ వహించండి : మీరు ఆహారం తినేటప్పుడు, నోటిపై శ్రద్ధ వహించండి. మీరు పెద్ద పెద్ధ ముద్ధలను మింగ కూడదు. చిన్న చిన్న ముక్కలు చేసి తినాలి. ఇలా చేస్తే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. నమలకుండా ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరగదు. అజీర్ణం అనేక వ్యాధులకు కారణమవుతుంది.

తొందరగా నిద్ర పట్టడానికి 5 బెస్ట్ టెక్నిక్స్ – 5 Best Sleeping Techniques
మనసు ప్రశాంతంగా ఉండటానికి మన శ్వాసకి సంబంధం ఏంటి?

Share with your friends & family
Posted in Health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading