మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి – Find Your Balance Point – Book Recommendations
Book Recommendations: మనం జీవితంలో ఎంతగా పరుగులు తీస్తున్నామో మనకే తెలీదు. పొద్దున్నే లేచి పని, ఒత్తిడి, గమ్యాలు, డెడ్‌లైన్స్.. ఇలా రోజూ జీవన చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం. కానీ ఈ పరుగులో మన జీవితానికి అసలు అవసరమైన “బ్యాలెన్స్” ని మర్చిపోతున్నాం. ఇదే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది “Find Your Balance Point” అనే అద్భుతమైన పుస్తకం.

ఈ పుస్తకం మనకు చెప్పేది ఒకే మాట – “మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి… అప్పుడే మీరు నిజంగా విజయవంతులవుతారు.”
పుస్తక రచయితలు Brian Tracy మరియు Christina Stein, జీవితం లోనూ, కెరీర్ లోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక నమ్మకం తీసుకువస్తారు. మీరు మీ దృష్టిని సరైన పనులపై పెడితే, సరిగ్గా ఏం చేయాలో నిర్ణయించుకుంటే, విజయం నిస్సందేహంగా మీ పాదాలకు వందనం చేస్తుంది.
జీవితానికి గమ్యం ఉండాలి. కానీ ఆ గమ్యం వెళ్ళే దారిలో మన ఆరోగ్యం, ఆనందం, మనుషుల మధ్య బంధాలను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? అదే పాయింట్ ఈ పుస్తకం మనకి గుర్తు చేస్తుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక “బ్యాలెన్స్ పాయింట్” ఉంటుంది. ఆ పాయింట్ ఏమిటంటే, మీరు ఎక్కడైతే పని చేయడంలోనూ, జీవించడంలోనూ ఆనందాన్ని పొందుతున్నారో అదే మీ “బ్యాలెన్స్ పాయింట్”.
ఈ పుస్తకం మీరు చేసే పనుల్లో “ఉత్పాదకత(Productivity)” కూడా ఉండాలి, అదే సమయంలో మీరు “మనశాంతిగా” కూడా ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్న చోటే నిజమైన బ్యాలెన్స్ ఉంటుంది.
మీ రోజును స్టార్ట్ చేసే ముందు ఓ ప్రశ్న వేసుకోండి:
“ఈ రోజు నేను ఏ పనులు చేస్తే నా జీవితానికి ఎక్కువ విలువ లభిస్తుంది?”
ఈ ప్రశ్న మీ గమనాన్ని మార్చగలదు.
మల్టీటాస్కింగ్ మాయ. ఒకేసారి ఎన్నో పనులు చేయడం గొప్పగా అనిపించినా, అది మన ఫోకస్‌ను కచ్చితంగా చెడగొడుతుంది. ఒకసారి ఒక్క పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం వల్లే మంచి ఫలితాలు వస్తాయి.
ఈ పుస్తకంలో HVTs – High Value Tasks అనే కాన్సెప్ట్ ఉంది. ఇవే మన విజయానికి కీలకం. మనం ఎక్కువ సమయం ఈ HVTs కే కేటాయించాలి. చిన్నచిన్న పనులు కాదు, భవిష్యత్తును ప్రభావితం చేసే పనులే ముఖ్యం.
మన శక్తిని ఉదయాన్నే పెద్ద పనులకు వినియోగించాలి. ఉదయం మన మెదడు తాజా, శక్తివంతంగా ఉంటుంది. మీ జీవితంలో ఏది నిజంగా ముఖ్యమో, ఏది మీ హృదయాన్ని హత్తుకుంటుందో అదే దిశగా ముందుకు సాగండి. అవసరంలేని పనులకు “నో” అని చెప్పగలిగే ధైర్యం వుండటం కూడా బ్యాలెన్స్‌లో భాగమే.
జీవితంలో గమ్యానికి చేరడం కన్నా ఆనందంగా వుండడం ముఖ్యమైంది.
“Work hard, but not at the cost of your peace. Dream big, but also sleep well.”
ఒక పనిని ప్రేమతో, శ్రద్ధతో చేసినప్పుడు అది భారం కాదు, ఒక సంతృప్తి. అలాంటి పనులను ఎంచుకోండి.
మీ విలువలు, మీ లక్ష్యాలు, మీ శక్తి – ఈ మూడింటి మధ్య సమతుల్యతే మీ బ్యాలెన్స్ పాయింట్.
ఈ పుస్తకం చదవడం ద్వారా మీరు ఒక కొత్త దృష్టికోణాన్ని పొందుతారు. మీ జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది.
“Find Your Balance Point” – ప్రతిఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.
ది ఆల్కెమిస్ట్ – ప్రపంచం మొత్తం నీకు సహాయం చేస్తుంది – The Alchemist – Book Recommendation