ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Fathers Day Wishes, Greetings, Quotes, Status – ఫాదర్స్ డే
నాన్న.. ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి మీరు.
మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ ఫాదర్స్ డే.
నాన్న.. మీరే నా సూపర్ హీరో.
ఐ లవ్యూ డాడీ..
హ్యాపీ ఫాదర్స్ డే!!
నాన్న.. నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.
నా మంచి, చెడు, ఆనందం, విజయం..
అన్నింటి వెనకా మీరే ఉన్నారు.
నా కోసం ఎంతో త్యాగం చేశారు.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా..
నాన్న.. నా మొట్టమొదటి గురువు,
నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే.
అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలిబుచ్చుతుంది
కానీ, నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు.
గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..
ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని
దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే
ఫాదర్స్ డే శుభాకాంక్షలు
Fathers Day Wishes in Telugu
నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి..
మన మాటలు తప్పుపట్టే కొడుకులు సిద్ధమవుతుంటారు.
హ్యాపీ ఫాదర్స్ డే.
మనలో జీవాన్ని నింపి,
అల్లారు ముద్దుగా పెంచి..
మనలోని లోపాలను సరిచేస్తూ,
మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ..
మనకు గమ్యం చూపేది.. ‘నాన్న’.
అనురాగానికి రూపం ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే.
ఆ పెంపకానికి కారణం..
రేపటి మన భవిష్యత్తుకు
ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న,
అలాంటి నాన్న.. దేవుడికన్నా మిన్న.
హ్యాపీ ఫాదర్స్ డే.
Fathers Day Greetings in Telugu
ఓర్పుకు మారు పేరు,
నీతికి నిదర్శనం..
భవిష్యత్ మార్గదర్శకులు
మన ప్రగతికి సోపానం.. ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే
మేమున్నామని ఎందరు చెప్పిన
నాన్నగారి ఆధరణ ముందు అవి ఏవీ నిలబడవు
హ్యాపీ ఫాదర్స్ డే
నాన్న.. అన్న పదము కన్నకమ్మగ ఉండదు వెన్న
లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం మనమైనా..
మా బాగుకోసం.. భవిత కోసం..
ఆరాటం అని..
హ్యపీ ఫాదర్స్ డే
నా నాన్నే.. నాకు గురువు
అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన గొప్ప తండ్రి.
హ్యాపీ ఫాదర్స్ డే
ఓర్పుకు మారుపేరు
మార్పుకు మార్గదర్శి
నీతికి నిదర్శనం
మన ప్రగతికి సోపానం.. నాన్నే
హ్యాపీ ఫాదర్స్ డే.
Fathers Day Quotes in Telugu
నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు.
కానీ, అపజయం మాత్రం ఉండదు.
హ్యాపీ ఫాదర్స్ డే.
నాన్నలాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా..
నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా..
ఆ పెంపకానికి కారణం..
రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన
రేపటి మనకు నిలువుటద్దం నాన్న..
అలాంటి నాన్న దేవుడి కన్న మిన్న.
హ్యాపీ ఫాదర్స్ డే.
నువ్వు కోపంగా మాట్లాడుతుంటే..
ప్రశాంతతే తెలియదనుకున్నా..
కళ్లెర్రజేస్తుంటే.. కాఠిన్య హృదయమనుకున్నా..
ఆజ్ఞలు వేస్తుంటే బానిసగా బాధపడ్డా..
నాన్నా… నాకిప్పుడు తెలుస్తోంది..
వీటన్నిటి వెనుక మూల సూత్రం ఒకటుందని..
అదే మా పైన అమిత ప్రేమని,
హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
అమ్మది నమ్మకం
నాన్నది కోపం
ఇద్దరిదీ ప్రేమే!!
అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే..
నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది.
హ్యాపీ ఫాదర్స్ డే.
Fathers Day Status for WhatsApp in Telugu
ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా..
ఓడినప్పుడు నేనున్నాలే అని
వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి..
గెలిచినప్పుడు
పదిమందికి చెప్పుకుని
ఆనందపడే వ్యక్తి..
ఒక్కరే.. ఆయనే ‘నాన్న’
హ్యాపీ ఫాదర్స్ డే.
ఓర్పునకు మారుపేరు,
మార్పునకు మార్గదర్శి,
నీతికి నిదర్శనం…
అన్నీ నాన్నే…
గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని…
ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి …
‘నాన్న’ ఒక్కడే.
ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …
నీకు జన్మనే కాదు…
భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..
బయటకి కనిపించే నాన్న కోపం వెనుక..
ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…
నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు…
సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…
మనమెక్కిన తొలి విమానం…
మన తండ్రి “భుజాలే!
నాన్న ప్రేమకి రూపం ఉండదు…
భావం తప్ప!
నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది..
అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.
మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు.
కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’
పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’
నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు.
కాని అపజయం మాత్రం ఉండదు.
Fathers Day Messages in Telugu
జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో..
తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు.
ఓడిపోయినా సరే…
చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు – ‘నాన్న’.
మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే..
మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి
మనకి తండ్రి విలువ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.
తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు.
మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో ‘నాన్న’ ఒకరు.
తొలి జీతం అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’
జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.
నేను ఒక మంచి తండ్రిగా నా పిల్లలకి ఉండాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే, నేను ఒక గొప్ప తండ్రికి కొడుకుని కాబట్టి! – కాల్విన్ జాన్సన్
ఈ ప్రపంచంలో దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దని చెప్పాడు మా నాన్న.
ఎందుకంటే ‘పెర్ఫెక్ట్’ అంటూ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. – స్కాట్ ఈస్ట్ వుడ్
ఫాదర్స్ డే కోట్స్ – Fathers Day Quotes In Telugu – Fathers Day Wishes in Telugu