Menu Close

Eyy Bidda Idhi Naa Adda Lyrics in Telugu


Eyy Bidda Idhi Naa Adda Lyrics in Telugu – ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా తెలుగు సాహిత్యం

ఆ పక్క నాధే ఈ పక్క నాధే
తలపైనా ఆకాశం ముక్క నాదే
ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే
తప్పొప్పులు తాగాలెత్తే నిప్పు నేనే
నన్నైతే కొట్టేటోడు భూమిదే పుట్టలేదు
పుట్టాడ అది మల్ల నేనే
నను మించి యేధిగేటోడు
ఇంకోడు ఉన్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే
నేయ్ తిప్పాన మీసమాట
సేతులోన గొడ్డలాట
సేసింధే యుద్ధమాత
సెయ్యంధే సంధి అటాఆ

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
అరేయ్ ఏ బిడ్డా ఇది నా అడ్డా

నిను ఇంకా ఇసిరేస్తా
నేయ్ సేపతో తిరిగోస్త
గదా కర్రకు గుచ్చేస్తా
నేయ్ జెండాల యెగిరేస్తా
నిను మట్టిలో పాటేసి
మాయం చేస్తా
నేయ్ ఖరీదైనా ఖనిజంలా
మల్లీ దొరికేస్తా

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
అరేయ్ ఏ బిడ్డా ఇది నా అడ్డా

ఎవడ్రా ఎవడ్రా నువ్వు
ఇనుమును ఇనుమును నేను
నను కాలచితే కత్తౌతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
మట్టిని మట్టిని నేను
నను తొక్కితే ఇటుకౌతాను
ఎవడ్రా ఎవడ్రా నువ్వు
రాయిని రాయిని నేను
గాయం కానీ చేసారంటే
ఖాయంగా దేవుడ్నౌతాను

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
లే లే తగ్గేదేలే
అరేయ్ ఏ బిడ్డా ఇది నా అడ్డా
లే లే తగ్గేదేలే


చిత్రం: పుష్ప
గాయకుడు: నకాష్ అజీజ్
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading