Menu Close

రామాయణం కేవలం కథ కాదు – Evidence of Ramayana

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Evidence of Ramayana

మనం మనుషులం.. ఆలోచించగలం. మనకు ఏది నమ్మశక్యంగా వుంటే అదే నమ్ముతాము. ఈ పోస్ట్ పూర్తిగా చదివి నమ్మకం కుదిరితే నమ్మండి. ఈ దేశంలో రామాయణం నిజం అనే వారే కంటే నిజం కాదు కథ అనే వారే ఎక్కువ.

అయినా రామాయణం జరిగిందా లేదా అన్న వాదన పక్కన పెట్టి, రామాయణం నుండి మనం నేర్చుకున్నదేమిటి..? రామాయణం చెప్పిన నీతి, ధర్మం నేటి జీవన విదానానికి, ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాముడు ఎప్పటికీ పూజ్యనీయుడే. రామాయణం ఒక గొప్ప కావ్యమే..

Sri Rama Navami Stories

సీతా మాతను అపహరించి రావణుడు శ్రీలంకకు వెళ్లేటప్పుడు పుష్పక విమానం వెళ్లిన మార్గంలో ఏ శాస్త్రీయ రహస్యం దాగి ఉంది? వేల సంవత్సరాల క్రితం ఏ సాంకేతికత లేని రోజుల్లో ఆ మార్గం గురించి వాల్మీకి మహర్షికి ఎలా తెలుసు…?

ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఉపగ్రహ చిత్రాలు, గూగుల్ లాంటి సంస్థలు, అంతర్జాల సౌకర్యాలు ఆనాడు లేవుకదా, కానీ మన సనాతన ధర్మంలో వాటికన్నా ఎక్కువ విజ్ఞానమే ఉంది, మన మహర్షులు ఆ విజ్ఞానాన్ని ఉపయోగించే ఎన్నో ఖగోళ రహస్యాలను ఛేదించారు కూడా, కానీ వలస పాలకుల విధ్వంస రచనలో మనమెంతో విజ్ఞానా సంపదను కోల్పోయాము.

రావణుడు పంచవటి (నాసిక్, మహారాష్ట్ర) నుండి తల్లి సీతాదేవిని పుష్పక విమానంలో హంపి(కర్ణాటక), మరియు లేపాక్షి (ఆంధ్రప్రదేశ్) మీదుగా శ్రీలంకకు చేరుకున్నాడని రామాయణం చదివి అర్థం చేసుకున్నవారికి తెలిసే ఉంటుంది, కాల పరిణామ క్రమంలో ప్రాంతాల పేర్లు మారినా భౌతిక స్థితిగతుల ద్వారా ఆలోచించి అన్వయించుకుంటే, ఆ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.

నాసిక్, హంపి, లేపాక్షి మరియు శ్రీలంక లు ఒకే సరళ రేఖలో ఉన్నాయని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది.అంటే, పంచవటి నుండి శ్రీలంకకు అతి దగ్గరి వాయు మార్గం ఇది అన్నమాట.

ఆ కాలంలో ఇదే అతి చిన్నదైన మరియు సరళమైన (దగ్గర దారి) వాయుమార్గం అని ఎలా తెలిసింది వారికి అని ఆలోచిస్తే మన సనాతన విజ్ఞానం ఎంత గొప్పదో ఊహించవచ్చు, కొంతమంది నాస్తికులు రామాయణం కేవలం వాల్మీకి రాసిన పుక్కిటి పురాణం అని వాదించినా, ఆ సమయంలో ఎలాంటి సాంకేతికత లేకున్నా అప్పుడు రామాయణం రాసిన వాల్మీకి శ్రీలంక కు వెళ్లిన మార్గం గురించి ఎలా తెలుసు కోగలిగాడు అనేదానికి సమాధానం ఎవరైనా చెప్పగలరా…?

లంక నుండి పంచవటికి మధ్యలో ఏది సరళమైన మార్గం అనేది ఇతిహాసంలో ప్రస్తావన లేకుండా, స్థలాల ప్రస్తావన, మరియు ఆయా సంఘటనలు జరిగిన విధానాన్ని మాత్రమే చెప్పారు, ఇప్పుడు ఆ స్థలాల భౌతిక కోణం ఒకే సరళరేఖలో ఉండటం యాదృచ్ఛికం కాదు కదా..! ఇది చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
సీతాదేవిని అపహరించి వెళ్తున్న పుష్పక విమానం ప్రయాణించినట్టు చెప్పిన మార్గం మహర్షి వాల్మికి ఊహ మాత్రం గానే ఆయా ప్రదేశాలను ప్రస్తావించారని అసలు అనగలమా…?

ఇదే విధంగా సరిగ్గా 500 సంవత్సరాల క్రితం, గోస్వామి తులసీదాస్ కి భూమి నుండి సూర్యుడి దూరం ఎంత వుందో అని ఎలా కరెక్ట్ గా తెలుసు..!!?

(యుగ సహస్ర యోజన పరభానూ లీల్యోతాహి మధురఫలజానూ = అని అనగా 152మిలియన్ కిమీ అన్నమాట .!! (హనుమాన్ చాలిసాలో నుంచి) ఇటీవల నాసా కూడా ఈ దూరాన్ని గుర్తించింది.. మరి అప్పుడు మన పూర్వికులు చెప్పంది నిజమే కదా..!

ప్రవాస సమయంలో శ్రీ రాముడు, మాతా జానకిదేవి మరియు లక్ష్మణుడు నివసించిన ప్రదేశమే పంచవటి. శూర్పనఖ ఇక్కడికి వచ్చి లక్ష్మణ స్వామి ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయగా…… లక్ష్మణుడు శూర్పనఖ ముక్కును కత్తిరించవలసి వచ్చింది. ఈ రోజు ఈ స్థలాన్ని నాసిక్ (మహారాష్ట్ర)నందు కలదని మనకు తెలుసు కదా… ఇంకొంచెం ముందుకు వెళ్లి పరిశీలిద్దాం.

పుష్పక విమానం వెళ్ళే దారిలో, పర్వతం పైన కూర్చున్న కొంత మంది వానరోత్తములు ఆసక్తిగా చూస్తున్నారని…, సీతాదేవి గమనించారు. కాబట్టి సీతాదేవి తన చీర యొక్క చివర చించి, కంకణాన్ని, కొన్ని నగలను దానిలో కట్టి, రామచంద్రుడు వాటిని కనుగొనడంలో సహాయపడటానికి ఆ మూటను ఆ వానరోత్తముల దగ్గర పడేట్టు విసిరేయడం జరిగింది.

సీతా దేవి ఈ ఆభరణాలను జారవిడిచిన, ఆ వానరులందరూ వున్న ఆ పర్వత ప్రదేశమే… నేటి హంపి (కర్ణాటక) లో ఉన్న ‘ఋష్యమూకపర్వతం’. తరువాత వృద్ధుడైన పక్షిరాజు జటాయువు సీతాదేవి దుఃఖాన్ని చూశాడు, ఒక రాక్షసుడు తన విమానంలోకి తీసుకెళ్లడం చూశాడు.

సీతా దేవిని కాపాడటానికి జటాయువు రావణుడితో పోరాడాడు…. చివరకు రావణుడు కత్తితో జటాయువు రెక్కలను కత్తిరించాడు. దీని తరువాత రామ, లక్ష్మణులు సీతా దేవిని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు, వారు జటాయువు ను చూడడం జరిగింది. ఆ స్థలం పేరు దక్షిణ భాషలో లేపాక్షి (ఆంధ్రప్రదేశ్).

దీని ప్రకారం ప్రకారం చూస్తే..
పంచవటి – హంపి – లేపాక్షి – శ్రీలంక ఒకసరళ మార్గం. దగ్గరైన, వాయుమార్గం యొక్క సాక్ష్యం. (Google మ్యాప్స్ ప్రకటించిన ఫోటో క్రింద ఉంది.)

sri ramudu

తమ జ్ఞానం-విజ్ఞానం, సంస్కృతిని మరచిపోయిన భారత ప్రజలతో పాటు, విదేశీయులు కూడా రామాయణం పురాణం కాదు అని గ్రహించాలి. అది ఒక ఇతిహాసం. మహర్షి వాల్మీకి రాసిన నిజమైన చరిత్ర ఇది. ఈ రోజు ఎన్నో శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో ఉన్నాయి.

Evidence of Ramayana

Like and Share
+1
3
+1
0
+1
0

Subscribe for latest updates

Loading