ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Eruvaka Sagaro Lyrics in Telugu – Rojulu Maraayi
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న
నవ ధ్యానాలను గంపకెత్తుకొని
చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని
ఇల్లాలునీ వెంటబెట్టుకొని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు గురిసె
వాగులు వంకలు ఉరవడి జేసె
ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
కోటేరును సరి జూచి ఎన్నుకో
ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో
కాలు తప్పక కొంత వేటుతో
విత్తనము విసిరిసిరి జల్లుకో
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పొలాలమ్ముకొని పోయేవారు
టౌనులో మేడలు కట్టేవారు
బ్యాంకులో డబ్బును దాచేవారు
ఈ చట్టిని గమనించరు వారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు
వొళ్లు వంచి చాకిరికి మళ్లరు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
పదవులు తిరమని బ్రమిసే వాళ్లే
కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే
నీవే దిక్కని వత్తురు పదవోయ్
రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
హై హై హై హై