అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
ఓ తండ్రి డైరీలో చివరి పేజి ఇది – Emotional Stories in Telugu

అలసిపోయాను, నీరసపడిపోయాను,
ముసలివాణ్ణి దయచేసి నన్ను అర్థం చేసుకో !
బట్టలు వేసుకోవటం కష్టం.
తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను.
గట్టిగా కట్టుకోలేను.
అందుకే తొలగిపోతూంటుంది. కసురుకోకు,
అన్నం తింటునప్పుడు చప్పుడవుతుంది.
చప్పుడు కాకుండా తినలేను అసహ్యించుకోకు.
నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే..
గుర్తు తెచ్చుకోరా, బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు.
అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి.
ఒకే విషయాన్ని పదేపదే చెబుతుంటాను.
విసుక్కోకు, స్నానం చేయటానికి ఓపిక ఉండదు.
చేయలేదని తిట్టకు,
నువ్వుకూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించే వాడివో గుర్తుందా?
తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు.
కీళ్ళ నొప్పులు నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి.
లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు.
నీకు నడక వచ్చేవరకు నేను అలాగే నిన్ను వేలుపట్టుకుని నడిపించాను.
అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా !
ఏదో ఒక రోజు, నాకు బతకాలని లేదు.
చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్థం చేసుకో.
ఈ వయసులో బతకాలని ఉండదు.
కాని బతకక తప్పదు. ముసలికంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు.
దగ్గరగా తీసుకుని కూర్చో నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా
నేను అలాగే దగ్గరగా తీసుకునే వాణ్ణి.
నువ్వలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతానురా!
- Telugu Love Stories
- Prema Kathalu
- Pitta Kathalu
- Neethi Kathalu
- Telugu Heart Touching Stories
- Telugu Emotional Stories
- Telugu Sad Stories