Menu Close

Emotional Stories in Telugu – కన్నీరు పెట్టించే కథ


Emotional Stories in Telugu – కన్నీరు పెట్టించే కథ

ఆ రోజు కోపంతో ఇంటి నుండి వెళ్ళేప్పుడే అనుకున్నా, ‘నేను బాగా పెద్దవాడినయ్యే వరకూ ఇంటికి రాగూడదని. కనీసం బైక్ కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజనీరును ఎలా చేస్తారు’ కోపంలో నాన్న బూట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించ లేదు. అంతే కాదు ఆయన పర్సును కూడా దొంగతనం చేసేసాను. అందులో కొన్ని చినిగి పోయిన కాయితాలే ఉన్నాయి.

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

బస్టాండ్ కు పరుగెడుడుతున్న నాకు అరికాళ్ళలో ఏదో గుచ్చుకుంటున్నట్లయింది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది బూటు అడుగు భాగాన రంధ్రం పడి ఉందని. బస్టాండ్ లో నాన్న పర్సు తీసి చూసాను. ₹40,000/- ఆఫీసు నుండి తీసుకున్న అప్పు తాలూకు చీటీ, దాంతోపాటు నా కోసం కొన్న లాప్ టాప్ బిల్లు.

మానేజర్ నుండి వచ్చిన ఉత్తరం, ఆఫీస్ కు మంచి బూట్లు వేసుకు రమ్మని. పాత స్కూటర్ కు, కొత్త బైక్ ఇస్తామని ఒక ఎక్స్ చేంజ్ ఆఫర్ ఉన్న పేపర్. అప్పుడు గుర్తొచ్చింది ఇంటినుండి బయలు దేరేప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ బూట్లలో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను.

నాన్న, నాన్న స్కూటర్ ఎక్స్ చేంజ్ ఆఫర్ ఉన్న చోట కనిపించారు. నాన్నను గట్టిగా కౌగలించుకుని, “నాన్నా! నాకు బైక్ వద్దు” అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమైంది. అమ్మ, నాన్నలు మమ్మల్ని ఉన్నతంగా తీర్చి దిద్దడానికి మాకోసం ఎంత కష్టపడుతున్నారోనని! ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో!! వాళ్ళను ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం ఒత్తిడి చేయకూడదని.

తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళను ఇబ్బందులపాలు చేసి, వాళ్ళు పోయిన తర్వాత బాధపడడంలో అర్థం లేదు.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Emotional Stories in Telugu

Like and Share
+1
18
+1
2
+1
0
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading