ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఏం చెప్పను..? నిన్నెలా ఆపను..?
ఓ ప్రాణమా… నిన్నెలా వదలను..?
ఏ ప్రశ్నను… ఎవరినేమడగను..?
ఓ మౌనమా… నిన్నెలా దాటను..?
పెదాలపైన నవ్వుపూత… పూసుకున్న నేనే
కన్నీటితో ఈ వేళ దాన్నెలా చెరపను…?
తన జ్ఞాపకమైనా తగదని… మనసునెలా మార్చను..?
ఈ ప్రేమకీ ఏమిటీ వేడుక… ఏ జన్మకీ జంటగా ఉండక…
ఏం చెప్పను..? నిన్నెలా ఆపను..?
ఓ ప్రాణమా… నిన్నెలా వదలను..?
ఇదివరకలవాటులేనిది… మనసుకి ఈ మమత కొత్తది
దొరకక దొరికింది గనక… చేజారుతుంటే ఏం తోచకున్నది
ఊరించిన నీలి మబ్బుని… ఊహించని గాలి తాకిడి
ఎటువైపో తరుముతుంటే… కళ్ళార చూస్తూ ఎల్లా మరి…
ఎడారి వైపు వెళ్ళకంటు… ఆపి వాన చెలిని
తడారుతున్న గుండెలోకి రారమ్మని…
తన వెంటపడి… ఇటు తీసుకురాలేవా ఊపిరి..?
ఈ ప్రేమకీ ఏమిటీ వేడుక… ఏ జన్మకీ జంటగా ఉండక…
నా మనసున చోటు చిన్నది… ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది… మది మోయలేని అనుబంధమై అది…
నువ్విచ్చిన సంపదే ఇది… నా చుట్టూ అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల… వీలులేని ఇరుకైనది…
సుదూరమైన ఆశలెన్నో… చేరువౌతూ ఉన్నా
అవందుకోను నిన్ను… వీడి నే వెళ్ళనా
పొందేది ఏదో… పోతున్నదేదో తెల్చేదెవ్వరు…?
ఈ ప్రేమకీ ఏమిటీ వేడుక… ఏ జన్మకీ జంటగా ఉండక…