ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావే
నీ పిచ్చి పట్టించేసావే… పిల్ల పిల్ల పిల్లా
నా ముందుకొచ్చి పిలిచావే… నా మనస్సునిట్టా గుంజావే
చచ్చేంత ప్రేమే పెంచావే… పిల్ల పిల్ల పిల్లా
నీ చూపుతో నా చూపు కలిసే
నీ మాటతో నా మాట కలిసే
నీ అడుగు వెంట… నా అడుగు నడిచే
నీ నవ్వులో పూల జల్లు కురిసే
నువ్వుంటే చాలే… నువ్వుంటే చాలే, చాలే
నువ్వుంటే చాలే పిల్లా
ఈ బుజ్జి పాపకు నచ్చావోయ్… నా బుజ్జి గుండెను గిచ్చావోయ్
నీ పిచ్చి పట్టించేసావోయ్… ఓ నల్ల పిల్లగాడా
జతపడి జగమే మరిచేలా… ఆశగా మనసే మురిసేలా
ఎదలయ పరుగులు తీసేనులే నీకోసమే
ఇలా ఇలా నా ప్రాణమే… నీ ధ్యాసలో మునిగిందిలే
ఎలా ఎలా ఆపాలనే… ఆలోచనే ఇక లేదులే
నువ్వుంటే చాలే… నువ్వుంటే చాలే, చాలే
నువ్వుంటే చాలే పిల్లా
ఈ బుజ్జి పాపకు నచ్చావోయ్… నా బుజ్జి గుండెను గిచ్చావోయ్
నీ పిచ్చి పట్టించేసావోయ్… ఓ నల్ల పిల్లగాడా
ఊపిరినొదిలే క్షణమైనా… వదలను నిను నే నేమైనా
కడవరకు నే నీతోడుగా ఉంటానులే
నేను అదే మాటివ్వనా… నిజం ఇదే ఒట్టేయనా
నీవాన్నిగా వెంటుండనా… దూరంకానే శ్వాసాగినా
నువ్వుంటే చాలే… నువ్వుంటే చాలే, చాలే
నువ్వుంటే చాలే
ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావే
నీ పిచ్చి పట్టించేసావే… పిల్లా పిల్లా పిల్లా